శ్రీకాకుళం

సొమ్ము వాపస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 15: ఉత్తరాంధ్రా జిల్లాల్లో వివిధ నిర్మాణాలకు ప్రధాన భూమిక పోషించిన సిక్కోలు ఇసుకను దండిగా ఎగుమతి చేసుకొని కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్న వ్యాపారులకు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీతో ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలనుండి ఇసుకను తొలుత బాబు సర్కార్ క్యూబిక్ మీటర్ రూ.550 వంతున మీ-సేవా కేంద్రాల ద్వారా పొందిన డిడిలకు సరఫరా చేసింది. ఈ పాలసీని క్యాష్ చేసుకోవాలని ఇసుక వ్యాపారులు తత్కాల్ టికెట్ల మాదిరిగా అధిక సొమ్ము ముట్టజెప్పి మీ-సేవా కేంద్రాలనుండి డిడిలు సొంతం చేసుకొని సుమారు రూ.60 వేలకు ఇసుక లారీని విశాఖనగరంలో విక్రయించి లాభాలు ఆర్జించేవారు. ఈ పరిస్థితులు ప్రభుత్వం కొనసాగిస్తోందని అత్యాశకు పోయిన వ్యాపారులు క్యూబిక్ మీటర్‌కు రూ.550 వంతున రూ.8,750 15 క్యూబిక్‌మీటర్ల ఇసుకకు డిడి మీ-సేవ కేంద్రంలో డౌన్‌లోడ్ చేసేవారు. జిల్లాలోని ఆమదాలవలస మండలం తోటాడ అక్కివరం, నరసన్నపేట మండలం గోపాలపెంట ఇసుక రీచ్‌లనుండి డీడీలకు ఇసుకను ప్రభుత్వం సరఫరా చేసేది. ఈ సరఫరాను సొమ్ము చేసుకోవాలన్న అత్యాశతో మీసేవా నిర్వాహకుల నుంచి ఇసుక వ్యాపారులు రూ.12వేల నుండి రూ.16 వేల వరకు చెల్లించి ఇసుక లారీల ద్వారా పోటాపోటీగా తరలిస్తూ లాభాలు మస్తుగా ఆర్జించేవారు. జిల్లాలోని అనేక ర్యాంపులనుండి ఇసుకను డీడీల ప్రాప్తికి తరలిస్తున్న ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసే సమయానికి 40వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకకు సంబంధించిన డీడీలు వ్యాపారుల వద్ద మిగిలిపోయాయి. వీటి విలువ సుమారు రూ.2.20కోట్లుగా చెప్పుకున్నా మరో రూ.1.50కోట్లు చేతులు మారి ఉంటుందని ఇసుకాశురులు గుసగుసలాడుకుంటున్నారు. ఇటువంటి లావాదేవీలకు ప్రభుత్వం చెక్ పెట్టేలా ఉచిత ఇసుక పాలసీను తెరపైకి తేవడంతో డీడీలు పొందిన వ్యాపారులంతా కంగుతినాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే డీడీల ప్రాప్తికి ఇసుక తొలుత సరఫరా చేస్తారని అనంతరం ఉచిత ఇసుకకు ర్యాంపులు తెరుస్తారని అధికార యంత్రాంగం చెప్పుకురావడంతో వీరంతా ఆశలు పెంచుకున్నారు. ఇసుక వ్యాపారుల అంచనాలు తలకిందులయ్యేలా బాబు సర్కార్ జిల్లాలో తొలి విడత ఏడు రీచ్‌లను, రెండవ విడత ఐదు రీచ్‌లకు అనుమతులు జారీ చేయడంతో వ్యాపారుల నోటిలో మట్టికొట్టేలా వ్యవహరించింది. ఇదిలా ఉండగా ఇటీవలి జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం జిల్లా ఇసుక కమిటీ సమావేశం ఏర్పాటు చేసి గతంలో డీడీలు పొందినవారికి సొమ్ము వాపస్ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వారు డి ఆర్ డి ఏ కార్యాలయానికి డీడీతోపాటు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఫోన్‌నెంబర్ అందివ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీడీలు భద్ర పరిచిన వ్యాపారులంతా బెంబేలెత్తుతున్నారు. దారిన పోయిన దానయ్యలపేరు మీద కూడా డీడీలు పొంది ఇసుకను ఎగుమతి చేసుకున్నవారు అటువంటి వారి పూర్తివివరాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. లాభాలు రాకపోయినా పెట్టుబడిలో కొంతమొత్తాన్ని అయినా దక్కించుకునేందుకు డి ఆర్ డి ఏ కార్యాలయం చుట్టూ వీరంతా ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఊపిరి పీల్చుకున్న మహిళా సంఘాలు
ఇసుక విక్రయాల బాధ్యతను నెత్తినేసుకున్న మహిళా సంఘాలు అప్పులతో తిప్పలు పడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ పథకాల పేరిట రుణాలు పొంది పలు మహిళా సంఘాలు తొలుత ముద్దాడపేట, దూసి, బుచ్చిపేట తదితర రీచ్‌లకు అప్రోచ్ రోడ్లు నిర్మించారు. అలాగే ఇసుక అమ్మకాలకు డీడీలు కూడా మహిళా సంఘాలు కొన్ని చోట్ల తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధికారులు డిడిలు తీసిన వ్యాపారులకు సొమ్ములు వాపస్ చేయాలని తీసుకున్న నిర్ణయంతో మహిళా సంఘాలు ఊపిరి పీల్చుకున్నాయి. సుమారు రూ.70లక్షలు మహిళా సంఘాలు రీచ్‌ల ప్రారంభానికి పెట్టుబడి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందుల నుండి మహిళా సంఘాలను గట్టెక్కించేందుకు డీడీల వాపస్‌కు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు వాడీ వేడి చర్చ సాగుతుంది. ఏది ఏమైనా డీడీల వాపస్ అటు వ్యాపారులకు, ఇటు మహిళా సంఘాలకు ఊరటనిచ్చినట్టయ్యింది