శ్రీకాకుళం

సాగునీటిని సంరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటబొమ్మాళి, ఏప్రిల్ 15: సాగునీటిని రైతులు నూతన వ్యవసాయ విధానాలు అవలంభించడం ద్వారా సంరక్షించుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని సౌఢాం గ్రామంలో వర్షిణి నూతన సాగునీటి విధానం పైలట్ ప్రాజెక్టును శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆగ్రి బిజినెస్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో లిమ్‌సే అమెరికా కంపెనీ సాంకేతిక సహాయంతో జిల్లా వ్యవసాయశాఖ పర్యవేక్షణలో వర్షిణి రైన్ జెన్స్‌తో నూతన సాగునీటి విధానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంట పొలాల్లో గుంటలు తీసుకోవాలని, వర్షాలు పడినప్పుడు నీటిని నిల్వ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 15 వేల రేయింజన్స్‌ను కొనుగోలు చేసిందని, అన్ని జిల్లాల్లో ఉపయోగించడం ద్వారా తక్కువ నీటిని ఖర్చు చేసి పంటలు పండించుకోవచ్చునన్నారు. చెక్‌డ్యామ్‌లను నిర్మించుకొని పంటలను తగు నీటి నిల్వలు ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుందన్నారు. కొత్తపల్లి అట్లసాగరంపై ఈ విధానం ద్వారా నీటిని నిల్వ చేసామన్నారు. జిల్లాలో పూర్తిస్థాయిలో మూడు పంటలు పండించుకునే విధంగా నీటిని అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు సహకరించాలన్నారు. నూతన వ్యవసాయపద్దతులు అవలంభించి పంటలు దిగుబడి పెంచుకోవాలన్నారు.
జర్జంగి నుంచి పిండ్రువాడకు 30 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరైందని, దీనిలో 2 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, శ్రీముఖలింగంలో రోడ్లు విస్తరణ పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మినృసింహం, ఎంపి రామ్మోహన్‌నాయుడు, వర్షిణి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎస్.నేతాజీ, నరసన్నపేట ఎమ్మెల్యే బి.రమణమూర్తి, ఎంపిపి రామకృష్ణ, ఎజెసి రజనీకాంతారావు, టిడిపి నాయకులు గోవిందరాజులు, రమేష్, జెడి రామారావు, రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్‌ఎల్ నాయుడు, నాగయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.