శ్రీకాకుళం

కన్నుల పండువగా రాములోరి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, ఏప్రిల్ 15: మండలంలోని ఎచ్చెర్ల ఎఆర్ క్వార్టర్స్‌లో కొలువై ఉన్న కోదండరామ ఆలయ సన్నిధిలో నవ వసంతాన్ని పురష్కరించుకుని శుక్రవారం రాముల వారి కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎప్పుడూ విధుల్లో తీరిక లేకుండా గడిపే ఎఆర్ పోలీసులు, వారి కుటుంబాలు సీతారాముల కల్యాణాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించడం పరిపాటి. అదే సందడి నడుమ పచ్చని తోరణాలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు పురోహితుల ఆశీర్వచనాల నడుమ సీతారాముల కల్యాణాన్ని ఆర్‌ఐ కోటేశ్వరరావు దంపతులు నిర్వహించారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, ముత్యాలు, తంబ్రాలు వంటి సాంప్రదాయ వేడుకను తలపించేలా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పూర్తిచేశారు. ఈ పెళ్లికి పెద్దలుగా జిల్లా ఎస్పీ ఎ ఎస్‌ఖాన్, టిడిపి జిల్లా మాజీ అధ్యక్షులు చౌదరిబాజ్జీ, సర్పంచ్ మెండ రాజారావు, హోమ్‌గార్డ్ ఆర్.ఐ కె.రవికుమార్, సిటిజన్ ఫోరమ్ అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు, సంఘ సేవకుడు శాస్ర్తీ, హాజరయ్యారు. ఈ వేడుకను తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. రాముల వారి పెళ్లి ముగిసాక ప్రసాద వితరణ, విందు ఆరగింపు కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో...
చదువుల తల్లిగా ఫరిడిల్లుతున్న అంబేద్కర్ విశ్వ విద్యాలయం ఆవరణలోని దివంగత సర్థార్ గౌతు లచ్చన్న కళా ప్రాంగణం వేదికగా శ్రీరామ నవమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ప్రతి ఏటా నవమి ఉత్సవాలను పురష్కరించుకుని జానకి,రాముల వివాహాం కమనీయంగా జరుపుకోవడం పరిపాటి. విద్యార్థులు విరాళాలు సేకరించి భావితరాలకు ఈ వేడుకను అందించాలన్న సంకల్పంతో శుక్రవారం శ్రీరామనవమిని పురష్కరించుకుని సీతారాముల వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లికి పెద్దలుగా వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ సతీ సమేతంగా హాజరై జరిపారు. అలాగే రెక్టార్ ఎం.చంద్రయ్య, చీఫ్ వార్డన్ బి.అడ్డయ్యలు పూజల్లో పాల్గొన్నారు. విద్యార్థులు బోధనేతర సిబ్బంది అధిక సంఖ్యలో హాజరయ్యారు. వివాహ వేడుక ముగిసిన వెంటనే నారాయణ సేవ నిర్వహించారు. .