శ్రీకాకుళం

వాడవాడలా నవమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), ఏప్రిల్ 15: అందాల రాముడు అందరివాడు... అందుకే రామాలయం లేదా రామమందిరం లేని వాడంటూ ఉండరు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీతారామ కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. పాతశ్రీకాకుళం కలెక్టర్ బంగ్లారోడ్‌లోని సాయి మందిరంలో సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దంపతులను నిర్వాహకులు సన్మానించారు. పుణ్యపువీధి అభయాంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కల్యాణోత్సవాల్లో భాగంగా పందిర్రాట కార్యక్రమం జరిగింది. సాయంత్రం చామంతి పూలతో విశేష పుష్పార్చన నిర్వహించారు. ధర్మకర్త ముక్కాల కొండబాబుతోపాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బలగ మెట్టువద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కన్యాదానం, సప్తపది, సుముహూర్తం వంటి బొమ్మల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతీ ఐ.టి.ఐ కరస్పాంటెండెంట్ చిట్టి నాగభూషణం దంపతులు పాల్గొన్నారు. పి ఎన్ కాలనీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో జరిగిన కల్యాణోత్సవ వేడుకల్లో ఆలయ ధర్మకర్త, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు పాల్గొన్నారు. ఫాజుల్‌బేగ్‌పేట రామమందిరంలో పన్నాల నర్శింహమూర్తి ఆధ్వర్యంలో సీతారామ కల్యాణం నిర్వహించారు. కొత్తవంతెన సమీపంలోని దత్తక్షేత్రంలో జరిగిన నవమి పూజల్లో సామూహికంగాభక్తులు పాల్గొన్నారు. హయాత్‌నగరం రామమందిరంలో కిల్లాన బోజకుమార్ ఆధ్వర్యంలో నవమి ఉత్సవాలు నిర్వహించారు. తుమ్మావీధి, పెద్దరెల్లివీధి, గుజరాతీపేట, కత్తెరవీధి, నానుబాలవీధి తదితర ప్రాంతాల్లోని రామమందిరాల్లోనూ సీతారామ కల్యాణాన్ని నిర్వహించారు.
సింగుపురంలో ఘనంగా సీతారాముల కల్యాణం
శ్రీకాకుళం(రూరల్): మండలంలోని సింగుపురం గ్రామంలో చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామపురోహితులు పెంటా చిట్టిబాబు శర్మ, రామకృష్ణశర్మ నేతృత్వంలో కల్యాణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యే పూజలు నిర్వహించి పట్ట్భాషేకం జరిగింది. ప్రశాంతనగర్ కాలనీలో కొర్లాం సత్యన్నారాయణ దంపతులచే కల్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం మధ్యాహ్నం సింగుపురంలో మందిరం దరి అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
గారలో...
గార: శ్రీరామ నవమి సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల్లో గల రామ మందిరాల్లో నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కూర్మ పుణ్య క్షేత్రంతో పాటు తండ్యాలుపేట, బూరవెల్లి, పూసర్లపాడు, అంబళ్లవలస, కుమ్మరిపేట, కళింగపట్నం, సతివాడ, అంపోలు, గొంటి, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో ఈ నవమి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవానికి సంబంధించి నాటి ఉదయం 4గంటలు నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గోన్నారు.
మండలం పూసర్లపాడు గ్రామంలో అర్చకస్వామి ఆరవెల్లి సీతారామస్వామి నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కూర్మక్షేత్రంలో ఆలయ ప్రధానార్చకుడు చామర్తి సీతారామ నృసింహాచార్యులు నేతృత్వంలో అర్చక స్వాములు నవమి ఉత్సవాలు నిర్వహించారు.
తండ్యాలుపేటలో అర్చక స్వామి గోపినంబాల కూర్మరాజాచార్యులు నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు