శ్రీకాకుళం

బెల్ట్ షాపులు తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 19: జిల్లాలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు వెలిశాయని, అధికారులు చోద్యం చూడకుండా తక్షణమే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన జి.ఖగేంద్రనాయుడు కోరారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు ఫోన్‌లో వినతులు స్వీకరించారు. హిరమండలం చిన కొల్లివలస గ్రామం నుండి బి.తవిటయ్య ఫోన్‌చేస్తూ వంశధార ప్రాజెక్టులో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. మందస మండలం బేతాళపురం నుండి కె.కరుణ వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరారు. ఎచ్చెర్ల మండలం పాతదిబ్బల పాలెం గ్రామం నుండి సిహెచ్.లక్ష్మణరావు ఫోన్‌చేస్తూ నూతనంగా నిర్మించిన తుపాను సెంటర్‌ను ప్రజలకు అప్పగించాలని అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో పందుల సంచారం వలన ఇబ్బందికరంగా ఉందని 13వ వార్డుకు చెందిన పి.శ్రీనివాసరావు ఫోన్‌చేశారు. కొత్తూరు మండలం బలద గ్రామం నుండి ఐ.ప్రభాకరరావు మాట్లాడుతూ జనరిక్ మందుల షాపు కావాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం మీ సేవలో నమోదు కావడం లేదని పోలాకి నుండి ఎం.డి.ప్రకృద్దీన్ ఫోన్‌చేసి అడిగారు. కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ సంచాలకులు కిషోర్‌కుమార్, సిపివో శివరామ్ నాయకర్, సెట్‌శ్రీ సిఈవో మూర్తి పాల్గొన్నారు.