శ్రీకాకుళం

సిక్కోలు కార్పొరేషన్ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలగ, సెప్టెంబర్ 19: త్వరలో జరగనున్న శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో సోమవారం కార్పొరేషన్ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎప్పుడూ శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు వైసిపికి అనుకూలంగా ఉన్నాయని అందువల్లే ఎన్నికలకు వెళ్లేందుకు తెలుగుదేశంపార్టీ బయపడుతుందని ఆయన ఆరోపించారు. శ్రీకాకుళం నగరం 50వార్డులుగా రూపొందుతుందని అయితే వార్డులు విభజన శాస్ర్తీయంగా జరగాలని ఆయన సూచించారు. టౌన్‌ప్లాన్ అధికార యంత్రాంగం పర్యవేక్షణలో వార్డులు విభజన జరగడం లేదని అరసవల్లి కేంద్రంగా విభజన ప్రక్రియ ప్రారంభమైందని పరోక్షంగా గుండ దంపతులపై మండిపడ్డారు. ఎటువంటి చర్యలకు పాల్పడుతున్న అధికార పార్టీ తీరును ప్రజలకు వివరించి వార్డుల్లో వైసిపిని బలోపేతం చేయాలన్నారు. ప్రజలతో సత్సంబాలు నెరిపి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టగలిగితే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి జెండా ఎగురవేయగలమని స్పష్టంచేశారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు, బెల్లాన చంద్రశేఖర్, రాజులు హాజరు కాగా ఈ సమావేశానికి జిల్లా పార్టీఅధ్యక్షురాలు రెడ్డిశాంతి అధ్యక్షత వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్‌లు అందవరపు వరహానరసింహం. ఎంవి పద్మావతి, సాదు వైకుంఠరావు, పైడి మహేశ్వరరావులు మాట్లాడారు. అందవరపు సూరిబాబు స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా కోరాడ రమేష్ సమావేశానికి హాజరైనవారికి ధన్యవాదాలు తెలిపారు.