శ్రీకాకుళం

వ్యవసాయ రంగానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతపట్నం, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం నూతన వ్యవసాయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా రైతాంగం ఆధునిక వ్యవసాయ విధానాలను పాటిస్తూ ప్రకృతి సేద్యంలో దేశంలోనే ముందంజలో ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్లలో రైతులకు సేద్యానికై సకాలంలో రుణాలు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయానికి నూతన భవనం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం అందిస్తుందని అదే విధంలో సకాలంలో విత్తనాలను సరఫరా చేసిందని తెలిపారు. అనంతరం రైతులకు నీటి ఇంజన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి అధ్యక్షుడు కొంచార వీరభద్రరావు, పైల లచ్చుమయ్య, జెడ్‌పిటిసి ప్రతినిధి సీమ రామకృష్ణతోపాటు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.