శ్రీకాకుళం

ఆధ్యాత్మిక ఝరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: జిల్లాలో త్వరలో ఆధ్యాత్మిక భావాలు సెలయేరులా ప్రవహించనున్నాయి. అప్పుడప్పుడు అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్న వాతావరణంలో ఇక ప్రశాంతత ఏర్పడనుంది. వివరాలివి. జాతీయ రహదారికి ఆనుకుని తర్లిపేట నుంచి టెక్కలికి వెళ్ళే మార్గంలో తర్లికొండ సర్వే నెం.36లో 209 ఎకరాలు వేదవిద్య విశ్వవిద్యాలయానికి భూమి కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో జిల్లాలో 300 కోట్ల రూపాయలతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామీజీ ట్రస్టు (జీయర్ ఇంట్రిగ్రేటేడ్ వేడిక్ అకాడమి) నిర్మించనున్న వేదవిశ్వవిద్యాలయానికి 209 ఎకరాల భూమిని ప్రభుత్వ మార్కెటు విలువ మేరకు కేటాయింపులు చేస్తున్నట్టు క్యాబినెట్ నిర్ణయించింది. జిల్లా మంత్రి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కృషి, ఆయన ఆధ్యాత్మిక చింతనతో చేసే ఈ ప్రయత్నం పూర్తి సఫలీకృతం కావడంతో జిల్లాకు ఈ అకాడమీ వంటి అత్యున్నతమైన వేదవిద్యవిధానం ఏర్పాటుకావడం జిల్లాకు పుణ్యఫలమేనంటూ వేదపండితులు హర్షిస్తున్నారు. సర్వే నెం. 36లో 258 ఎకరాలు ఉండగా, ఇందులో మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హయాంలో నాలుగు ఎకరాలు డిఫెన్స్ సిబ్బందికి పట్టాలు ఇవ్వగా, మరో 15 ఎకరాలు దారిద్య్రరేఖకు దిగుననున్న వారికి కాలనీల కోసం పట్టాలు, ఇంకో పది ఎకరాలు కూడా పేదోళ్ళ పట్టాలుగా పంపిణీ చేశారు. ఇందులో మిగిలిన భూమిలో 209 ఎకరాలు వేదిక్ అకాడమి నిర్మించనున్న దేవాలయాలు, వేద విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని గతంలో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పలుమార్లు వేదిక్ అకాడమీ పెద్దలతో కలిసి పరిశీలించిన విషయం తెలిసిందే. కొండపై భాగంలో ఎకరా స్థలం ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం లక్ష రూపాయలు చొప్పున్న కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, మైదాన ప్రాంతంలో ఎకరా విలువ 1.50-2.50 లక్షల రూపాయలగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 209 ఎకరాలకు వేదిక్ అకాడమికి ఇవ్వాలంటూ కలెక్టర్ నివేదికలు పంపారు. ఇందులో మైదానం ప్రాంతం 50-60 ఎకరాలు ఉండగా, కొండ ఎగువభాగం మిగిలింది ఉంటోందని టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో వేద విశ్వవిద్యాలయం నిర్మాణానికి చిన్నజీయ్యర్‌స్వామీజీ ట్రస్టు ముందుకురావడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అందుకుకావల్సిన స్థలాన్ని కేటాయింపులు చేయడం, అందుకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కృషి చేయడం వంటి శుభపరిణామాలు ‘శ్రీ’కాకుళాన్ని ఆధ్యాత్మిక అడుగులువైపు మరింతగా నడిపించనున్నాయి. ఇందుకు పాలకులు, ప్రభుత్వ అధికారులు సమష్టగా పనిచేస్తున్న వాతావరణం శుభసూచికమేనంటూ వేదపండితులు ఆశీర్వదిస్తున్నారు.