శ్రీకాకుళం

విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ పాత్ర కీలకమని జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సపై ఫస్ట్ మెడికల్ రెస్పాండర్‌ల నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్థానిక శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంలో గురువారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విపత్తులు-కమ్యూనికేషన్ పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్‌లో ప్రధానంగా ప్రసార మాధ్యమాలు అత్యంత ఉపయోగకరమన్నారు. ప్రసార మాధ్యమాల సహకారంతో ప్రజలను అప్రమత్తం చేయడం సులభతరమన్నారు. అంతేకాకుండా స్థానికంగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తులు, సంస్థల వివరాలు అందుబాటులో ఉండాలని, తద్వారా తక్షణ సాయానికి వారి సహాయ సహకారాలు పొందవచ్చని అన్నారు. సోషల్ మీడియాను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సభ్యులు చంద్రశేఖర రావు, సత్యన్నారాయణ, స్వచ్ఛంద సేవాదళం సభ్యులు సూర్యారాలు పాల్గొన్నారు.