శ్రీకాకుళం

పారిశుద్ధ్యం ఇంత అధ్వాన్నమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: రాష్ట్రంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించడం సబబుగా లేదని ఎమ్మెల్యే లక్ష్మీదేవి అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వార్డు పర్యటనలో భాగంగా స్థానిక పదో వార్డు పరిధిలోని రెడ్డికవీధి, పుప్పాలవీధి, ప్రకాశనగర్ కాలనీ, గొంటివీధి, ఏనుగుల మహల్‌వీధిల్లో పర్యటించి అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకాష్‌నగర్ కాలనీలో పర్యటిస్తుండగా రోడ్డుపై నీరునిలిచి బురదమయం కావడంతో వెంట ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కాలువలు శుభ్రం చేసి రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట వార్డు ఇంచార్జి బస్వా రాజేష్‌రెడ్డి, టిడిపి నగర అధ్యక్షుడు వెంకటేష్, ఎస్సీ, బిసి రుణాల కమిటీ సభ్యులు ఎస్.వి.రమణ, మల్లికార్జున, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.