శ్రీకాకుళం

రెండేళ్ళ పాలనలో ఒక్క ఇల్లూ మంజూరు కాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రెండున్నరేళ్ళు పాలన సాగిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క నిరుపేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేయకపోవడం విచారకరమని రాష్ట్ర వైసిసి బిసి సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం అక్కురాడ, లచ్చన్నపేట, కామినాయుడుపేట గ్రామాల్లో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. కామినాయుడు పేట గ్రామంలో పలువురు మహిళలు పింఛన్లు రావడం లేదని కృష్ణదాస్ దగ్గర మొరపెట్టుకున్నారు. లచ్ఛన్నపేట గ్రామంలో నిరుపేదలకు ఇళ్లు లేవని ఆందోళన చెందారు. మరికొందరు రేషన్‌కార్డులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి నిర్వచనం తెలిపిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం వచ్చేవరకు ప్రజలు అన్ని విధాల కృషి చేయాలని దివంగత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు ఈ రాష్ట్రానికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మండల పార్టీ అధ్యక్షులు మొజ్జాడ శ్యామలరావు, వైసిపి నాయకులు బుక్క లక్ష్మణరావు, కనుసు సీతారాం, న్యాయవాది డి.మన్మధరావు, తంగి మురళీకృష్ణ, మాజీ విఆర్‌వో పి.రామ్మూర్తి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.