శ్రీకాకుళం

ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో ఉత్త సేవలందించిన అధికారులకు, వాలంటీర్లకు ఈనెల 29న రాష్టస్థ్రాయి అవార్డులు అంబేద్కర్ వర్శిటీ కేంద్రంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తామని ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో చురుకైన పాత్ర పోషించి ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒక ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, ఆరుగురు ప్రోగ్రామ్ ఆఫీసర్లు, పదిమంది వాలంటీర్లను అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్టస్థ్రాయి ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరుకానున్నారని వీసి వెల్లడించారు. ఈయనతోపాటు రిజిస్ట్రార్ జి.తులసీరావు, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ సంజీవయ్యలు ఉన్నారు.