శ్రీకాకుళం

ఆటోమిషన్‌తో ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: ఆటోమిషన్ పద్దతి వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించవచ్చునని ఇండోవెల్ ఆటోమిషన్(పూణె) డైరెక్టర్ హిమామ్స్‌కుమార్ స్పష్టంచేశారు. చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆటోమిషన్ పద్ధతులపై ప్రారంభమైన జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ ముగింపుకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటోమిషన్ ద్వారా పరిశ్రమల్లో సిబ్బంది ఆదా అవుతారని ప్రమాదాల శాతం నివారించవచ్చునని వివరించారు. పనిభారం తగ్గించడమే కాకుండా మంచి ఫలితాలు సాధించవచ్చునని విద్యార్థులకు వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులు కూడా ఈ పద్ధతిలో సాధించవచ్చునని విద్యార్థులు గుర్తెరగాలన్నారు. సాంకేతిక రంగంలో ప్రస్తుతం చోటుచేసుకున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా పి ఎల్ సి, స్కాడా ఆటోమిషన్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈనాలుగు రోజులపాటు ఇక్కడ థియరీ, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని అందించడం జరిగిందని దీనిని సృజనాత్మకంగా విద్యార్థులు తీసుకోవాలని సూచించారు.
స్థానిక ప్రయోగశాలలో ఒక ప్రాజెక్ట్‌ను కూడా రూపొందించి విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఇండోవేల్ ఆటోమిషన్ సంస్థతో శివానీ కళాశాల ఎంవోయు కుదుర్చుకొని ఈ పత్రాలను ప్రిన్సిపల్ బి.మురళీకృష్ణ అందిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ వోడి మురళీ, జి.టి చంద్రశేఖర్‌లు ఉన్నారు.

ఉత్తమ యువజన సంఘం అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 22: జిల్లాలో యువజన సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు ఉత్తమ సేవలందించిన యువజన సంఘాలు, మహిళా మండలిలు 2015-16 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘం అవార్డును ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు యూత్‌కో ఆర్డినేటర్ కె వి రమణ ప్రకటనలో తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1-4-2015 నుండి 31-3-2016 లోపల నిర్వహించిన వివిధ కార్యక్రమాలు వృత్తి శిక్షణ శిబిరాలు అవగాహన సదస్సులు, నాయకత్వ శిక్షణా శిబిరాలు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ్భారత్, పారిశుద్ధ్యం, ఎయిడ్స్ నివారణ వంటి సామాజిక చైతన్య సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని నివేదికలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్‌లు, ఫోటోలు రెండు సెట్లు దరఖాస్తులను నింపి స్థానిక నెహ్రూ కేంద్రం, ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన, పాలకొండ రోడ్, శ్రీకాకుళానికి అందజేయాల్సిందిగా కోరారు. అక్టోబర్ 10వ తేదీ లోగా అందజేయాలని కోరారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపికైన ఉత్తమ యువజన సంఘానికి రూ.25వేల నగదు పురష్కారం, ప్రశంసాపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన యువజన సంఘం దరఖాస్తును రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంపికలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.