శ్రీకాకుళం

కార్పొరేషన్‌కు మరో రూ. 31 కోట్లు కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: నగరపాలక సంస్థ ఎన్నికల నగరా మోగకముందే ఎన్నికల వరాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే.. రెండేళ్ళ తెలుగుదేశం పాలనలో రూ. 28 కోట్ల రూపాయలు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేయడం, ప్రతిపాదించిన ఆ పనులు మరో 30 శాతం వరకూ జరగవల్సివున్న విషయం తెలిసిందే. మరో 31 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు కావాలంటూ ఇటీవల జిల్లాకు విచ్చేసి కార్పొరేషన్ ఎన్నికల కసరత్తు చేసిన ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత ముఖ్యమంత్రికి ప్రతిపాదించడం, దానిని జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బలపరచడం, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ధ్రువీకరించడం జరిగింది.
రెండెంకల ప్రగతి సాధనలో భాగంగా శ్రీకాకుళ నగరానికి మరో 31 కోట్ల రూపాయలతో మూడు మాసాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న ఆలోచనలతో ఇక్కడ ప్రజాప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యవసరంగా రూ. 31 కోట్ల రూపాయలతో అభివృద్ధికి రెండు రోజుల కిందట మంత్రులు సునీత, అచ్చెన్న, ఎమ్మెల్యే లక్ష్మీదేవి ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ప్రభుత్వానికి పంపారు. నాగావళి నదిలో నిల్వ చేసేందుకు అక్కడక్కడ అడ్డుకట్టలు పెట్టేందుకు రూ. 4 కోట్లు, నగరంలో సిసీ రోడ్డులకు ఐదు కోట్లు, 2.9 కోట్ల రూపాయలతో ఏడురోడ్లు జంక్షన్ నుంచి డే అండ్ నైట్ నుంచి సూర్యమహాల్ జంక్షన్ రింగ్‌రోడ్డులో కాల్వలపై పలకలు వేసి బ్యూటిఫికేషన్, రూ. నాలుగు కోట్లతో ట్రీట్‌మెంటు ప్లాంటు (ప్రత్యేక మొక్కలు పెంపకం), నదీపరివాహాక ప్రాంతంలో రూ. 1.6 కోట్లతో గ్రీన్‌ట్రీ, ఎల్‌ఈడీ బల్బులకు 60 లక్షలు, అమృత పథకానికి 11 లక్షలు, మెప్మా ద్వారా నిర్వహిస్తున్న వివిధ పథకాలకు 44 లక్షలు కేటాయించాలంటూ నివేదికలు ప్రభుత్వానికి పంపారు. ఇదిలా ఉండగా, రింగ్‌రోడ్డు నిర్మాణం పనులు కూడా స్పీడ్ పెంచాలంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే కోరుతూ 400 కోట్ల రూపాయలతో భూసేకరణ, రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా కలెక్టర్ ద్వారా పంపారు.