శ్రీకాకుళం

కేంద్ర పథకాలపై ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రూపొందిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా క్షేత్రస్థాయిలో నెహ్రూ యువకేంద్రం వాలంటీర్లు ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రచారాధికారి డాక్టర్ జి.కొండలరావు కోరారు. స్థానిక టిటిడిసిలో మూడు రోజులుగా నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన హాజరై పలు విషయాల్లో శిక్షణ ఇచ్చారు. అటల్ ఫించన్‌యోజన పథకం, మేక్ ఇన్ ఇండియా, ఫసల్‌భీమా వంటి పథకాల ద్వారా ఎలా లబ్ధిపొందాలన్న విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. దీని ప్రయోజనాల వలన ఆయా కుటుంబాలు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలను తెలియజేయాలని సూచించారు. మాతాశిశు ఆరోగ్య కార్యక్రమాలు, ప్రభుత్వ ఆరోగ్య రక్షణ, మిషన్ ఇంద్రదనస్సు, బాలికల రక్షణ వంటి కేంద్రప్రభుత్వ పథకాలు ప్రజల ముగింటకు చేర్చే చైతన్య కార్యక్రమాలను యువజన సంఘాల ద్వారా నిర్వహించాలన్నారు. ఇటువంటి కార్యక్రమాలను లబ్ధిదారులు అందిపుచ్చుకున్నట్లయితే సమాజాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. వాలంటీర్లంతా యువజన సంఘాలను ఏర్పాటు చేసి వారిలో మరింత అవగాహన కల్పించగలిగితే నెహ్రూ యువకేంద్రం లక్ష్యాలు సాధన సులువౌతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్ వై కె ప్రతినిధులు రాంప్రసాద్, సత్యన్నారాయణలు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో , ప.గోజిల్లాలకు చెందిన వాలంటీర్లు పాల్గొన్నారు.