శ్రీకాకుళం

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో చక్కగా అమలు పరిచి గ్రామాలను అభివృద్ధి పరచాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పనులపై సర్పంచ్‌లపై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సర్పంచ్‌లు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఈనెల 21 నుండి 23వరకు పలాస, గోపీదేవపేట, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా పరిషత్‌తో కలిసి 4 కేంద్రాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ గ్రామంలో ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లను వినియోగించుకునే అలవాటు చేసుకోవడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత ఏర్పడి వ్యాధులు దూరమవుతాయని తెలిపారు. శతశాతం మరుగుదొడ్లను పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.5లక్షలను ప్రోత్సాహకంగా అందిస్తుందని తెలిపారు. గ్రామైఖ్య సంఘాలకు పొదుపు నేర్చుకొని ఆర్థిక క్రమశిక్షణ అలవడాలని సూచించారు. జిల్లాలో 1.43లక్షల ఇంకుడు గుంతలకు చెల్లింపులు జరిగాయని 1.70లక్షల ఇంకుడు గుంతలకు చెల్లింపులు జరగాల్సి ఉందని తెలిపారు. ప్రతీ ఇంటికి ఒక ఇంకుడు గుంత చొప్పున అన్ని ఇండ్లకు ఇంకుడు గుంతలు పూర్తి చేసిన గ్రామ పంచాయతీకి రూ.2లక్షలు అందిస్తుందన్నారు. ఒక్కొ కిలోమీటర్ పరిధిలో 400 మొక్కలు నాటి వాటి పాలన, పోషణ చేపట్టిన గ్రామైఖ్య సంఘాలకు మూడేళ్ళపాటు రూ.3.5లక్షలు అందిస్తామని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులను అందిస్తుందని జిల్లాలో ఈ కార్యక్రమానికి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉన్నదీ తెలిపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఐదేసి మొక్కలు చొప్పున పంపిణీ చేశామన్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను ఎవరైనా తొలగిస్తే శిక్షించాలన్నారు. దోమలపై యుద్ధం- పరిసరాల పరిశుభ్రత అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులపై ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం, చెత్తను తొలగించడం, రహదారి సౌకర్యం కలిగించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి గ్రామాలను పేదరికం నుండి విముక్తి కలిగించాలని తెలిపారు. నెలకు ప్రతీ కుటుంబం రూ.10వేలు, ఏడాదికి రూ. 1లక్ష ఆదాయాన్ని పొందే విధంగా అభివృద్ధి సాధించాలన్నారు. సర్పంచ్‌ల ద్వారానే గ్రామాల్లో మంచిమార్పు రావాలన్నారు. ఇంకుడు గుంతల బకాయిలను నెలాఖరు లోగా మండలాభివృద్ధి అధికారులు చెల్లించాలన్నారు. చంద్రన్న బాట ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తున్న ప్రోత్సహకాలను అందిపుచ్చుకొని సర్పంచ్‌లు గ్రామాలను అభివృద్ధి పరచాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సనపల తిరుపతిరావు మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమానికి జెడ్పి సీ ఇవో బి.నగేష్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ వో మెండ ప్రవీణ్, ఎంపిడివోలు ప్రభావతి, విద్యాసాగర్, వాసుదేవరావు, ఈవో పి ఆర్డిలు సర్పంచ్‌లు పాల్గొన్నారు.