శ్రీకాకుళం

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను కలిసిన కలెక్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 25: ప్రభు త్వం ముందస్తు వాతావరణ హెచ్చరికలతో జిల్లాకు చేరిన జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సహాయ కమాండెంట్ డి.కె.సాహు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీనృసింహంను ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వర్షాల పరిస్థితి, జిల్లాలో ప్రభావంపై విపులంగా చర్చించారు. భారీ వర్షాలు కురవచ్చునే సూచనలతో కటక్ నుంచి ఈ బృందం శనివారం ఉదయం జిల్లాకు చేరుకుంది. 21వ శతాబ్ది గురుకులంలో ప్రస్తుతం 80 మంది సభ్యులుగల ఈ దళం వేచి ఉంది. ఎక్కడైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే అచ్చక రిస్క్యూ ఆపరేషన్ చేయుటకు సిద్ధంగా ఉంది. ఈ దళంలో 80 మంది సభ్యులు ఉండగా ఈలో నైపుణ్యం కలిగిన సిబ్బంది, డీప్ డైవర్స్ (లోతైన నీటి ప్రాంతాల్లో సైతం వెళ్ళి వెదికేవారు) వరదల ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుటకు 8 రబ్బర్ బోట్లు, లైఫ్ జాకట్లు, కూలిన చెట్లను తక్షణం తొలగించే కటింగ్ సాధనాలు, భవనాలు కూలిపోతే వాటి శిధిలాల క్రింద ఎవరైన ఉంటే వారిని రక్షించే తదితర సాధానాలు ఉన్నాయని సహాయ కమాండెంట్ తెలిపారు. దళంలో 15 మంది వరకు తెలుగు యువకులు ఉన్నారు. సహాయక చర్యలకు జిల్లాకు విచ్చేసిన దళంకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.