శ్రీకాకుళం

హరికథా కాలక్షేపం విజ్ఞానదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 26: హరికాథ కాలక్షేపం పూర్వనుంచి నేటి వరకు విజ్ఞాన దాయకమైన అంశమని డిఎం అండ్ హెచ్‌ఒ ఎస్.తిరుపతిరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో మిత్రా సాంస్కృతిక సమితీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఆదిభట్ల నారాయణదాస్ 152వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన హరికథాసప్తాహం రెండో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. హరికథాకాలక్షేపాల ద్వారా ప్రేక్షకులకు భారత, భాగవతాలపైన ఆధ్యాత్మిక చింతనపై విజ్ఞానాన్ని కలిగించి సేవా కార్యక్రమాలకు తావు తీస్తుందన్నారు. అనంతరం విశ్రాంత జిల్లా జడ్జి బొడ్డేపల్లి రామారావు మాట్లాడుతూ మిత్రా సాంస్కృతిక సమితీ ప్రతీ నెల పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఇవి అభినంచదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రాడ కైలాశరావు, మిత్రా సాంస్కృతిక సమితీ అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, సభ్యులు పులఖండం శ్రీనివాసరావు, దుప్పల వెంకటరావు, చిన్నారావు, ఉష, కొమనాపల్లి సురేష్, ఎం.రాజు, యు.పూజ, జ్యోతీ ప్రశన్న, పి.బారతీరమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతికి చెందిన జయంతి సావిత్రి ఎయిర్ అండ్ టివి కళాకారులచే శ్రీకృష్ణరాయబారం హరికథను నిర్వహించారు. ప్రేక్షకులకు ఈ హరికథ ఎంతగానో ఆకట్టుకుంది.

నిర్వాసితుల పునరావాస కాలనీ కోసం స్థల పరిశీలన
రణస్థలం, సెప్టెంబర్ 26: కొవ్వాడ అణువిద్యుత్ ఏర్పాటు ప్రాంతంలో నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మించడానికి అవసరమైన స్థలాలను రెవెన్యూ యంత్రాంగం సోమవారం పరిశీలించింది. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి కొవ్వాడ అణుపార్కు భూసేకరణ అధికారి సీతారామ ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం కొచ్చెర్ల పంచాయతీ పరిధిలోగల ప్రభుత్వ భూముల్లో పరిశీలించారు. ఇక్కడ గుర్తించిన భూములు పునరావాస కాలనీ కాని, అణువిద్యుత్ పార్కు సిబ్బంది నివాస గృహాలను నిర్మించనున్నట్టు తెలిపారు.