సంజీవని

షిజోఫ్రీనియా.. స్ప్లిట్ పర్సనాలిటీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరానికి ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తాయో మనసుకీ అన్ని రకాల అనారోగ్యాలున్నాయి. మనసు, శరీరం- రెండూ ఏ రకమైన అనారోగ్యాలు లేకుండా వుండడమే సంపూర్ణ ఆరోగ్యంగా వుండడం.
మానసిక రోగాలలో కూడా వున్న రకాల్ని తెలుసుకోకుండా పిచ్చి అని ఒకే గాటికి కట్టడం తప్పు. కొందరు కొన్ని మానసిక జబ్బుల్ని పోల్చుకోవడంలో కూడా తప్పు చేస్తుంటారు. స్ప్లిట్ పర్సనాలిటీ, షిజోఫ్రీనియా ఒకటేనని కొందరు భావిస్తుంటారు. ఈ రెంటిలోనూ తేడా వుంది. ఒక పద్ధతి లేకుండా ఆలోచనలు, స్పందనలు, అర్థం చేసుకోవడంలో తేడాలు లాంటివి వుంటాయి షిజోఫ్రీనియాలో. ఒక మనిషే భిన్న ప్రవృత్తుల భిన్న వ్యక్తులుగా ప్రవర్తించడాన్ని స్ప్లిట్ పర్సనాలిటీ లేక మల్టిపుల్ పర్సనాలిటీ అంటారు.
మానసిక అనారోగ్యాలలో షిజోఫ్రీనియా ఎక్కువగా కన్పిస్తుంది. వీరిలో సగం మంది మళ్లీ మామూలు మనుషులు కారు. షిజోఫ్రీనియా లక్షణాలలో ప్రధానంగా చెప్పుకోవలసింది వారి ఆలోచనా తీరు. వాస్తవానికి చాలా దూరంగా వుండడం, రకరకాల భ్రమలకు లోనై వాస్తవాల్ని మర్చిపోతారు. చెవుల్లో ఏవో మాటలు వినిపిస్తున్నట్లు ఉంటుంది. అక్కడ లేకపోయినా ఏవేవో దృశ్యాలుల కనిపిస్తాయి. తన భావాలకు తగ్గ మాటలు కోసం కూడా తెగ వెతుకులాట వుంటుంది. ఇతరుల మాటలకు చేతలకు చూపించే స్పందనలోనూ అర్థం వుండదు. దుఃఖపడాల్సిన సందర్భాలలో నవ్వుతారు. నవ్వాల్సిన సందర్భాలలో బాధపడతారు. చాలా ధనం, పేరుప్రఖ్యాతులు, శక్తి తమకి వుందని భ్రమిస్తారు, పేరనాయిడ్ షిజోఫ్రీనియాలో. తమని చంపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని భయపడతారు. ఇలాంటి లక్షణాలు ఆరునెలలకన్నా ఎక్కువ కాలం వుండి, తాగుడు లాంటి వాటివల్ల మెదడు, నిర్మాణ లోపాలవల్ల కాకపోతే షిజోఫ్రీనియాతో బాధపడుతున్నట్లే నిర్థారించుకోవచ్చు.
ఆలోచనలు, మూడ్, స్పందనలు కలిగించే మెదడులోని భాగాలమధ్య వుండాల్సిన బంధం దెబ్బతినడంవల్ల షిజోఫ్రీనియా రావచ్చు. లింబక్ సిస్టం, కార్టెక్స్‌లో మార్పులు కనిపిస్తాయి. షిజోఫ్రీనియాని తగ్గించడానికి యాంటీ సైకాటిక్ మందుల్ని వాడడంవల్ల డొపామిన్ అనే రసాయనం తగ్గి మెదడులో నరాల ఇంపల్సల్స్ తగ్గుతాయి. డొపామిన్ ఉత్పత్తి ఎక్కువైనా ఇబ్బంది పడుతుంటారు. మెదడులో లోపం పుట్టుకతో రావచ్చు. చిన్న వయస్సులో ప్రారంభం కావచ్చు. పెద్దయ్యాక హఠాత్తుగా బయటపడవచ్చు. మెదడులోని ఆ భాగాలు బాగా దెబ్బతినేదాకా లక్షణాలు బయటపడకపోవచ్చు.
వాస్తవాలకు రోగి పూర్తిగా దూరమైనపుడు ఆస్పత్రిలో వుంచి చికిత్స చేయించడం మంచిది. ఫ్యామిలీ థెరపీ, రిహాబిలిటేషన్ కూడా అవసరం. షిజోఫ్రీనియాలోని ఏ సబ్ గ్రూప్‌కి రిస్క్ ఎక్కువ అనే విషయంమీద పరిశోధనలు జరుగుతున్నాయి.

-డా పి.సి.పి.గుప్తా సైకియాట్రిస్ట్ .. 98480 63547