జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో సడలని ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 6: జమ్మూ, కాశ్మీర్‌లో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. అనంత్‌నాగ్, హోపియాన్ జిల్లాల్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మరోవైపు కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో వరసగా 29వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగడంతో జన జీవితం స్తంభించిపోయింది. అనంత్‌నాగ్ జిల్లా చీలో ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించినప్పుడు చెలరేగిన హింసలో 21 మంది గాయపడినట్లు ఒక అధికారి చెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వివిధ పద్ధతులను ఉపయోగించారని ఆయన చెప్పారు. షోపియాన్‌లో హెర్‌పోరా పోలీసు స్టేషన్‌పై ఆందోళనకారులు రాళ్ల వర్షం కురిపించారని, అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడినట్లు వార్తలు రాలేదని చెప్పారు. తాజా హింస దృష్ట్యా జనం కదలికలను ఆంక్షలను శనివారం కూడా పొడిగించినట్లు ఆ అధికారి చెప్పారు. తాజాగా శుక్రవారం చెలరేగిన హింసలో ముగ్గురు చనిపోగా, 150 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యగా శ్రీనగర్‌లోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో, బుద్గామ్ జిల్లాలోని నాలుగు పట్టణాల్లో అనంత్‌నాగ్ పట్టణంలో, బారాముల్లా జిల్లా కాన్‌పోరాలో కర్ఫ్యూను కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.