శ్రీకాకుళం

వడదెబ్బకు ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, ఏప్రిల్ 9: జిల్లాలో భానుడి ప్రతాపానికి శనివారం ముగ్గురు మృత్యువాత పడ్డారు. గార పంచాయతీ ఆరంగిపేట గ్రామానికి చెందిన రౌతు సన్నాసిరావు(65) శనివారం మధ్యాహ్నం 2-30గంటలు సమయంలో వడదెబ్బకు గురై మృతి చెందాడు. సన్యాసిరావు ఎండవేడిమి తాళలేక ఆస్వస్థతకు గురికావడంతో తక్షణమే వైద్య సహాయానికి చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. వడదెబ్బ కారణంగానే సన్యాసిరావు మృతి చెందాడని రెవెన్యూ పరిశీలకుడు డబ్బీరు రామక్రిష్ణ తెలిపారు.
జి.సిగడాంలో..
జి.సిగడాం, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని కాపువీధికి చెందిన మహంతి పైడితల్లి(65) శనివారం వడదెబ్బకు మృతిచెందింది. మధ్యాహ్నం 1గంటసమయంలో బహిర్భూమికి వెళ్లి అధిక ఉష్ణోగ్రత కారణంగా అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈమెకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని రెవెన్యూ పోలీస్, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేశారు.
మందసలో...
మందస, ఏప్రిల్ 9: మండలంలోని బాలిగాం గ్రామానికి చెందిన రైతు ఐ.రాజారావు(53) శనివారం వడదెబ్బకు మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. మృతుడు సన్నకారు రైతు కావడంతో, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఫార్మశీ విద్యార్థిని ఆత్మహత్య

ఎచ్చెర్ల, ఏప్రిల్ 9: మండలంలోని చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీ శివానీ ఫార్మశీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న కిలారి సంతోషి(19) శనివారం తరగతి గదిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సంతోషిది రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామం. ప్రతీ రోజూ సంతోషి కోష్ఠ కూడలి నుండి ఆర్టిసీ బస్సులో కళాశాలకు వచ్చి వెళ్లేది. శనివారం కూడా బస్సులో కళాశాలకు చేరుకున్న సంతోషి భోజనం చేసిన అనంతరం అపస్మారక స్థితిలోనికి చేరుకోంది. తర్వాత నోటిలోంచి నురగలు రావడంతో విద్యార్థులు ఇచ్చిన సమాచారం మేరకు కళాశాల సిబ్బంది హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సంతోషి మృతిచెందింది. ఆసుపత్రికి చేరుకున్న తండ్రి అప్పలనాయుడు, తల్లి అనసూయమ్మలు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు, గ్రామస్థులు ఆసుపత్రి దగ్గరకు చేరుకొని శోకసముద్రంలో మునిగిపోయారు. చదువుల్లో అత్యధిక మార్కులు సాధించిన సంతోషి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిదాయి కాదని, వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక సమస్యలు కూడా లేవని తండ్రి అప్పలనాయుడు, మేనమామ గొర్లె రమణలు పేర్కొంటున్నారు. కళాశాల యాజమాన్యం స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా దాటవేసేధోరణి ప్రదర్శిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంచార్జ్ సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ సందీప్‌లు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యపై విచారణ సాగిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద గుళికలు పడి ఉండటం, సూసైడ్ నోట్ లభించడంతో మరిన్ని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఆహారంలో గుళికలు కలిపి ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థులు స్పష్టంచేస్తున్నా పోలీసులు మాత్రం అనుమమానాస్పద స్థితిలో సంతోషి మృతిచెందినట్టు కేసు నమోదు చేస్తున్నామని ఎస్‌ఐ సందీప్ విలేఖర్లకు తెలిపారు. సంతోషి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు డి.వెంకటరావు, పి.దుర్గాశ్రీనివాస్, దుర్గాప్రసాదరాజులు విలేఖర్లతో మాట్లాడుతూ విచారణకు సహకరిస్తున్నామని ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

టిడిపి హయాంలో కూలిన వ్యవస్థలు
శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 9: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాలనా వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, వాటి అమలు తీరును గ్రహించే స్థితిలో ప్రజలు ఉండకపోవచ్చని, వాటిని ప్రతిపక్షమే చూడాల్సి ఉంటుందని తెలిపారు. పాలనా యంత్రాంగంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకపాలనపై ప్రతిపక్షం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే ప్రజా తిరస్కారానికి గురికాకతప్పదని, భవిష్యత్‌లో ప్రజలు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలంటే ప్రతిపక్ష పార్టీగా వైకాపా కార్యకర్తలు సమర్థవంతమైన బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో అత్యాశ పెరిగిపోయిందని విమర్శించారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలనైతే పూర్తిగా నిర్వీర్యం చేసేశారని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదల అభ్యున్నతే ధ్యేయంగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర రెడ్డి పనిచేసారని, నాయకుడంటే ప్రజలకోసం పనిచేయాలని తెలిపారు. టిడిపి వైఫల్యాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, అందవరపు వరహానర్శింహం, వై.వి. సూర్యనారాయణ, ఎం.వి.పద్మావతి, మార్పు ధర్మారావు, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, సాధు వైకుంఠరావు, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, పైడి మహేశ్వరరావు, చల్లా రవికుమార్, గుమ్మా నగేష్ పాల్గొన్నారు.

గురుకుల భవనాల్లో ట్రిపుల్ ఐటి
ఎచ్చెర్ల, ఏప్రిల్ 9: జిల్లా అభివృద్ధిలో ఓ మైలురాయిగా నిలిచే త్రిపుల్ ఐ.టి సంస్థను తాత్కాలికంగా ఎస్ ఎం పురం కొండపై కోట్లాది రూపాయాలతో నిర్మించిన 21వ శతాబ్దపు గురుకుల భవనాల్లో ప్రారంభిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్రిపుల్ ఐ.టి ని జిల్లాకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ 500 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ఇందుకు కావాల్సిన స్థలాన్ని సేకరించాలని కలెక్టర్‌ను సిఎం ఆదేశించడం పలు చోట్ల పరిశీలించి ప్రతిపాధనలు ప్రభుత్వానికి నివేదించారు. విద్యా సంవత్సరం మీదపడటంతో తాత్కాలికంగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి త్రిపుల్ ఐ.టిని ఏర్పాటు చేసి అడ్మిషన్లు చేపట్టాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు ఆదేశాలు సిఎం జారీచేయడంతో ఇక్కడి అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఈ భవనాల్లో నిన్నమొన్నటివరకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్, రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూమిలిచ్చిన కుటుంబాలకు చెందిన కొంతమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు కూడా ఇక్కడే నిపుణులతో ఇప్పించారు. పది ఎకరాల విస్తీర్ణంలో ఏడు బ్లాక్‌లో సుందరంగా సుమారు రూ.18కోట్లు వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్మించగా ఆయన హఠాన్మరణం తరువాత అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ భవనాలను ప్రారంభించారు. ఇటువంటి హంగులు ఉన్న భవనాలు వృధాగా పడి ఉండటాన్ని కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాస్ త్రిపుల్ ఐ .టి ప్రారంభానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్రిపుల్ ఐ.టి కళ సిక్కోలు విద్యార్థులకు ఈ రూపంలో నెరవేరనుంది. ఇటువంటి విద్యను అందిపుచ్చుకోవాలంటే నూజివీడు, కడప తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని వచ్చే విద్యాసంవత్సరంనుండి జిల్లా విద్యార్థులతోపాటు విజయనగరం, విశాఖపట్నం విద్యార్థులకు కూడా ఉండబోదు.
నేడు జిల్లా దేశం ‘సమన్వయ భేటీ’
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 9: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఆదివారం జిల్లా పార్టీ సమన్వయ కమిటీకి హాజరుకానున్నారు. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, విప్ కూన రవికుమార్, ఎం.పి. రామ్మోహన్‌నాయుడు, దేశం పార్టీ ఎమ్మెల్యేలతోపాటు, పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషా ‘్భటీ’ కానున్నారు. జిల్లా పార్టీ సమన్వయం కమిటీ ప్రతీ నెలకోసారి నిర్వహించుకోవడం పరిపాటైనా...ఈసారి మాత్రం సమావేశం అనడం కంటే దేశం కుటుంబ సభ్యుల సంవాదం అనే చెప్పాలి. అత్యంత కీలకమైన అజెండాలతో దిగ్గజాలన్నీ హాజరుకావడంతో జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించే ఆనవాయితీ నుంచి ఆర్ అండ్ బి వసతి గృహానికి ‘్భటీ’కై మకాం మార్చారు.
పి.వి.రమణ సోషల్ మీడియా సిక్రెట్లుపై చివరి అంకం వంటి అత్యవసర అజెండాపై చర్చ జరగనుంది. తెలుగుదేశంలో గ్రూపుల గోళకు కార్యకర్తలు బలిపశువులౌతున్నారు. పాలకొండ విబేధాలకు కేంద్ర బిందువుగా మారడం అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా తయారైంది. ఇక్కడ 35మంది జన్మభూమి కమిటీ సభ్యులను తొలగించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీరాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుసిఫార్సులు చేయగా మంత్రి అచ్చెన్నాయుడు అడ్డుకోవడంతో ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపినట్లయ్యింది. ఈ అంశంపై జిల్లా పార్టీఅధ్యక్షురాలు గౌతు శిరీషా వాడివేడీ చర్చ సాగుతుందని తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు. అలాగే మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.వి.రమణను పార్టీనుండి బహిష్కరించాలని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయ కమిటీ ఇప్పటికే తీర్మానించింది. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధిష్ఠానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ జిల్లా పెద్దలు గుంబనంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై పట్టణంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో రమణను ఎవరు ఆహ్వానించారని కొంతమంది మహిళ కార్యకర్తలు ప్రశ్నించడమే కాకుండా ఎమ్మెల్యే లక్ష్మీదేవి కూడా పార్టీ అధ్యక్షురాలతో సంవాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సమన్వయ కమిటీలో రమణపై చర్యలు అలసత్వానికి గల కారణాలు సభ్యులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉండగా పార్టీపరంగా, పాలనాపరంగా జిల్లాలో ఉప్పు-నిప్పులా తయారైన మంత్రి అచ్చెన్న, విప్ రవికుమార్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. మునుపెన్నడూ హాజరు కాని రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు ఈ సమన్వయ కమిటీకి హాజరుకానున్నారు. 17 మంది గల సమన్వయ కమిటీ చర్చించిన అంశాలు ఎటువంటి వివాదాలకు దారితీస్తాయో రమణ భవితవ్యం ఎటు తేలనుందో అన్న ఉత్కంఠ తమ్ముళ్లలో నెలకొంది.
............
పై ఐటెమ్‌నకు రెండు కలర్ పొటోలు పంపనున్నాము

13 నుంచి ఆదిత్యుని కల్యాణ మహోత్సవాలు
శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 9: ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అరసవల్లిలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి, ఉషాపద్మినీ ఛాయా దేవీలతో అత్యంత వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.శ్యామలాదేవి తెలిపారు. శనివారం స్థానిక ఆదిత్యుని ఆలయ ప్రాంగణంలోని ఆమె కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. చైత్ర శుద్ధ సప్తమిని పురస్కరించుకొని 13 సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణాంగ ధ్వజారోహణం, సకల దేవతాహ్వానం, విశేష అర్చన, దిగ్బలి ప్రదానం, హారతి ఉంటుందని అన్నారు. 16న సుగంధ ద్రవ్య మర్దన(కొట్నం దంపు) ఉత్సవ సాంప్రదాయ కీర్తనలతో నిర్వహిస్తామన్నారు. 17వ తేదీన శ్రీ స్వామివారి వెండ అశ్వవాహనాలపై గ్రామ తిరువీధి ఉత్సవం అనంతరం రాత్రి 9 గంటలకు ఆధిత్యునికి ఉషా పద్మినీ ఛాయాదేవీలతో కల్యాణ మహాత్సవం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన, ప్రవేశ హోమాదులు ఉంటాయని తెలిపారు. 18వ తేదీన ఆగ్నేయ స్థాలీపాక హోమాదులు, విశేష భోగములు జరుగుతాయన్నారు. అలాగే భక్తి సంగీత ఆర్కెస్ట్రాలో బాగంగా నరసన్నపేట వాస్తవ్యులు తర్ర ఆదినారాయణ బృందంచే సప్తగిరి సంగీత గానామృతంలో అన్నమయ్య కీర్తనలు, అష్టపదులు, భక్తి గీతాలు ఉంటాయన్నారు. 22వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే కళ్యాణమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు 500 రూ.లు చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చని తెలిపారు. సమావేశంలో ఆమెతో పాటు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కవిటి, ఏప్రిల్ 9: మండలంలోని శిలగాం గ్రామ సమీపంలోని శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో మంగి లక్ష్మీనారాయణ(20) అనే యువకుడు మృతి చెందాడు. కవిటి పోలీసులు తెలిపిన వివరాలివి. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఉగాది సందర్భంగా మండలంలోని పొందూరుపుట్టుగ గ్రామంలో గల తన అక్క ఇంటికి వచ్చాడు. ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణంలో శిలగాం గ్రామ సమీపంలోని గల కాళిమాత మర్రిచెట్టు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డపై పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. 108 వాహనంలో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో బరంపురం తరలించారు.అక్కడ లక్ష్మీనారాయణ మృతిచెందాడు. మృతదేహాన్ని శవపంచనామ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు బావ పొందూరు నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సి అప్పలనాయుడు తెలిపారు.
కార్మిక హక్కుల పరిరక్షణకు
జూన్ 11న దేశవ్యాప్త సమ్మె
* ఎపి, తెలంగాణ ఐఎన్‌టియుసి ఉపాధ్యక్షుడు మోహన్‌కుమార్
శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 9: కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు జూన్ 11న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నామని ఐఎన్‌టియుసి ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉపాధ్యక్షుడు కె.యస్.మోహన్‌కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేట్ సేవలో మునిగితేలుతున్న ప్రభుత్వాలు కార్మిక కోర్కెలపై స్పందించేందుకు సిద్ధం లేవన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 39 కోట్ల మందికి ఎటువంటి చట్టం వర్తించకపోవడం అన్యాయమన్నారు. కార్పొరేట్‌కు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక చట్టాలకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సవరణ చేస్తుండటం శోచనీయమన్నారు. జిల్లాలో అయితే కార్మికుని మొదటి హక్కుగా ఉన్న సంఘం ఏర్పాటును వ్యతిరేకించడం అన్యాయమన్నారు.
గతంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఏప్రిల్ 11న సమ్మె చేయతలపెట్టామని, అయితే చర్చల నేపథ్యంలో సమ్మె తేదీని పొడిగించినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారం కానియడల మే 10వ తేదీన నోటీసు ఇచ్చి జూన్ 11వ తేదీన సమ్మెలోకి వెళ్లేందుకు ప్రణాళిక తయారుచేసినట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఐయన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు కె.వి.ఎన్.్భస్కర్, వైకుంఠరావు, జి.రమేష్‌బాబు, సిహెచ్.పాపారావు తదితరులు పాల్గొన్నారు.
సిక్కోల్ తీరంలో సాగరమాల
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సాగరమాల ప్రాజెక్టులో సిక్కోల్ సముద్ర తీరం వెంబడి 193 కిలోమీటర్లు అభివృద్ధి ప్రతిపాదనలపై జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలు అంశాలను శనివారం ఢిల్లీలో సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ రెండో సమావేశంలో సుదీర్ఘంగా ప్రస్తావించారు. సాగరమాల కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులు, అనుసంధానించే పోర్టులపై చర్చించారు. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. నెల్లూరు జిల్లా తడ నుంచి ఇచ్ఛాపురం వరకూ గల కోస్టల్ కారిడార్‌లో అత్యంత ఎక్కువ ప్రాంతం శ్రీకాకుళం తీరంలో ఉందని అచ్చెన్న కమిటీ ముందు సుస్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధి వేగవంతం కావడానికి సముద్ర తీరం మరింత దోహదపడుతుందన్న విషయాన్ని మంత్రి అచ్చెన్న కమిటీ ప్రతినిధుల ముందు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరుఫున నిమ్మాడ నేత అచ్చెన్నాయుడు హాజరై అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై కేంద్ర మంత్రి నితిన్ గట్కకరి, అశోక్‌గజపతిరాజు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సాగరమాల కమిటీలో అచ్చెన్న ప్రతిపాదించిన అంశాలను ఢిల్లీ నుంచి ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వివరించారు. జిల్లాలో చింతపల్లి(విజయనగరం సరిహద్దు) తీరం నుంచి ఇచ్ఛాపురం వరకూ టూరిజం అభివృద్ధికి అనువైన ప్రాంతంగా అచ్చెన్న పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుత చట్టాల మేరకు 500 మీటర్లు సి.ఆర్.జెడ్ చట్టాన్ని సవరించినట్టయితే మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుంటుందన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు దృష్టికి తీసుకువచ్చారు. తీరం వెంబడి పర్యాటక రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఏర్పాటుకు ఆసక్తి కనబరిచిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భూములు కేటాయించగలిగితే సిక్కోలు అభివృద్ధి వేగవంతం కానుందన్నారు. పలు ప్రాజెక్టులకు వివిధ దేశాలతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్న విషయాలను విడమరిచారు.
సముద్రతీరం వెంబడి అటవీశాఖ పరిధిలో గల భూములపై గల చట్టాలను సవరించినట్లయితే కారిడార్ అంతా ప్రాజెక్టులతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న విషయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కమిటీ నిర్ణయంతో సింగిల్ డెస్క్ పాలసీ వర్తింపజేస్తే సిక్కోల్ సాగరంలో కేంద్రప్రాజెక్టు విజయవంతం అవుతుందంటూ, రాష్ట్రం నుంచి 38 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపినట్టు వివరించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూ.లు కేటాయించిన ఈ ప్రాజెక్టులో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అవస్థాపన సౌకర్యాల కోసం కేటాయించిందని, 7500 కిలోమీటర్లు దేశ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రగతిని మరింత వేగవంతం చేయాలన్న దృక్పథమే సాగరమాల ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు.

వలస!
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
సిక్కోలులో వలసదారులు తెరుచుకున్నాయి. వేలాది మంది కూలీలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో గ్రామాల్లో ఇళ్ళకు తాళాలు పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంద కోట్ల రూ.లతో కూలీలను ఆదుకోవాలన్న ఆశయానికి యంత్రాలు తూట్లు పొడుస్తున్నాయి.
ఉపాధి హామీ పథకం జిల్లాలో లక్షలాది మందికి జాబ్ కార్డులు ఇచ్చి పనులు కల్పించినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల వౌలిక సౌకర్యాల కోసం విడుదలయ్యే నిధుల్లో 52 కోట్ల రూ.లు మార్చి నెలాఖరు నాటికి మిగిలిపోవడంతో ఆ నిధులు వెనక్కి మళ్ళిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానంలో ఎన్నో జి.వో.లు.. వాటికి సవరణ జి.వో.లు ఇలా.. కార్పొరేట్ రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా చేసిన మార్పులు భవనకార్మికుల కుటుంబాలను రొడ్డేక్కించాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు సిక్కోల్ భవన కార్మికులు సుమారు ఏడు వేల మంది వలసపోయినట్టు కార్మికశాఖ పేర్కొంటున్నది. అంతకంటే ఎక్కువ కార్మికులే నగరాలకు వెళ్ళిపోయారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కనుసన్నల్లో నడుస్తున్న జన్మభూమి కమిటీలు తీరకు కూలీలు ఇక్కట్లపాలయ్యారు. యంత్రాలతో చెరువు పనులు చేయించి ప్రతీ గ్రామానికి పది లక్షల రూ.లు వరకూ బిల్లులు చేసుకున్న తెలుగుతమ్ముళ్ళ వైఖరి కూడా వలసలకు కారణమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా.. జిల్లా అంతటా లక్షలాది మంది కూలీలు వలసలు వెళ్ళిపోయారు. ప్రతీ ఏటా వేసవి కాలంలో ఇంటికి వచ్చే కూలీలు, ఈసారి మండుటెండల్లో తమ ఊరు.. అక్కడ ఉన్నవారిని వదిలి తట్టాబుట్టా సర్దుకుని పయనమవుతుంటే అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. ప్రధానంగా గ్రామాల్లోని ‘ఉపాధి’ పనులు చేయడం ద్వారా కూలీలకు ఎక్కువగా పని దొరికేది. అయితే, ప్రస్తుతం నీరు-చెట్టు పథకం ద్వారా ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4.80 లక్షల మంది ఉపాధి జాబ్‌కార్డులు ఉన్న కూలీలు ఉన్నారు. అయితే, ఈ ఏడాది వీరందరికీ పనికల్పించే అవకాశం లేదు.
నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వెయ్యి చెరువులు యంత్రాలతో పూడికలు తీసే కార్యక్రమం చేపట్టారు. ఒక్కొ చెరువుకు సగటున పదిలక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దీని వలన ఉపాధి పనులు కూలీలకు దొరికే అవకాశం లేదని ఉపాధి హామీ పథకం సిబ్బంది అంటున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో 15-20 వేల మంది కూలీలకు పనులు కల్పించాల్సి ఉన్నా అధికారులు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడం లేదు.
దీనికి తోడు ఇసుక నియంత్రణ వల్ల ప్రత్యామ్నాయంగా భవన నిర్మాణం పనులపై ఆధారపడ్డ కూలీలకు కూడా అటు భవన నిర్మాణాలు నిలిచిపోవడం, ఇటు ఉపాధి పనులు లేకపోవడంతో వలస పోతున్నారు. ఉపాధి హామీ నిధులతోనే గ్రామాల్లోకి సిమెంట్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా మార్చి నెలాఖరు నాటికి సర్పంచ్‌లు ఖర్చు చేయలేదు. దీంతో నిధులు వెనక్కి మళ్లాయి. సిమెంట్ రోడ్ల పనులు జరిగినా ఉపాధి కూలీలకు పనిదొరికేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

పది మూల్యాంకనం ప్రారంభం
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 9: పదో తరగతి మూల్యాంకనం శనివారం ప్రారంభమైంది. మూడు కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రభుత్వ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలోనూ, గీతాంజలి స్కూల్‌లో మూల్యాంకనాన్ని ప్రారంభించారు. గతంలో రెండు కేంద్రాల్లో ఉండటం వలన ఇబ్బందులు ఉండేవి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మూడో కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి జిల్లాకు 4.50లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఈనెల 22వ వరకు మూల్యాంకనం కొనసాగుతుంది. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆంగ్లం-1,2, ఒడియా వృత్తి విద్యాకోర్సులకు సంబంధించిన జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ, గణితం, భౌతికశాస్త్రం, బయాలజీ, సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఆంగ్ల మాధ్యమం జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. గీతాంజలి స్కూల్‌లో తెలుగు, గణితం, భౌతికశాస్త్రం, బయాలజీ, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన తెలుగు మాధ్యమం జవాబుపత్రాలను మూల్యాకనం చేస్తున్నారు. మూల్యాంకనానికి వచ్చే ఉపాధ్యాయులకు మధ్యాహ్నం భోజన సదుపాయం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. క్యారేజ్ తీసుకురాని ఉపాధ్యాయులకు సొమ్ము చెల్లించి అక్కడ భోజనం చేసే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి ఈ మూడు మూల్యాంకనం కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఒక్కొ మూక్యాంకనం కేంద్రానికి ఒక్క అధికారిని నియమించారు.