శ్రీకాకుళం

సమస్యల పరిష్కారానికై ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 25: సమస్యల పరిష్కారానికి కాంట్రాక్టు కార్మికులు, చీడివలస గ్రామస్థులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నాలు చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్శింగ్ ఉద్యోగులకు పదో పీఆర్సీ ప్రకారం సంబంధిత కేడర్‌ను అనుసరించి కనీస బేసిక్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్శింగ్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద ఫెడరేషన్ ఆద్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా, తమ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పర్యాయాలు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లినా లాభం లేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ అవుతుందని గతేడాది నుంచి ఎదురుచూస్తున్నామని, అయితే, రెగ్యులరైజ్ మాట అటుంచి 8, 9 పిఆర్సీల ప్రకారం కాకుండా అతి తక్కువ వేతనాలను పెంచాలని ఇటీవల మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయించినట్టు వెలువడిన ప్రకటన పట్ల తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ నిర్ణయం సరైంది కాదని, తమకు డిఎ, హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ వంటి సదుపాయాలు లేకపోగా, కనీస వేతనం లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నేతలు డి.సాయిప్రసాద్, జె.సింహాచలం, ఎం.ఎ.నాయుడు, బి.మురళి, డి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
మా భూముల రికార్డులు సరిచేయండి
* చీడివలస రైతుల అభ్యర్థన
బూర్జ మండలం చీడివలస గ్రామంలో సాగు భూముల రికార్డులు సరిచేయాలని ఆ గ్రామ సర్పంచ్‌తో పాటు ఎంపిటిసి, గ్రామస్థులు సోమవారం కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో విలేఖర్లతో మాట్లాడారు. భూముల రికార్డులు సరిలేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. సొంతభూములైనప్పటికీ, క్రయవిక్రయాలు లేకపోవడంతో ఇళ్లల్లో శుభకార్యాలు చేసుకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై తాము అనేక పర్యాయాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని అన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమి రైతు వద్దలేదని, అలాగే రైతు సాగుచేస్తున్న భూమి ప్రభుత్వ రికార్డుల్లో లేదని తెలిపారు. దీంతో క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు అభ్యంతరం చెబుతుండటంతో తాము ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా భూములు పూర్తిస్థాయిలో సర్వేచేపట్టి సరిచేయవలసిందిగా కోరుతున్నామన్నారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ బి.లక్ష్మి, బి.వెంకటేశ్వరరావు, పి.చిన్నికృష్ణ, ఎ.నర్శింహమూర్తి తదితరులు ఉన్నారు.
.............