శ్రీకాకుళం

‘గ్రీవెన్స్’కు వెల్లువెత్తిన వినతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 25: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే ఫిర్యాదుల విభాగానికి వినతులు వెల్లువెత్తాయి. మండుటెండను సైతం లెక్కచేయక అర్జీదారులు బారులుతీరారు. సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుండి పలువురు అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని కోరారు. సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, అక్కడి సర్పంచ్, ఎంపిడివోలు నిర్లక్ష్యం వహిస్తున్నారని తగు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరారు. వీరఘట్టాం మండలం వండువ గ్రామ పంచాయతీ దళిత మహిళ సర్పంచ్ ఎ.దాలమ్మ చెక్ పవర్ నిలిపివేయడం సరైన చర్యకాదని, వెంటనే ఆమె చెక్‌పవర్‌ను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని దళిత సంఘాల సంయుక్త మండలి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని వినతిపత్రం కలెక్టర్‌కు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.కృష్ణ్భారతి, డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ ఆర్.శ్యామల, హౌసింగ్ పిడి ఆర్.నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది మండలాల్లో గిడ్డంగులు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 25: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఎఫ్‌పి షాపులకు ప్రతీ నెలా నిత్యావసర సరుకులు భద్రపరుచుకునేందుకు వీలుగా ఎనిమిది మండల కేంద్రాల్లో గిడ్డంగులు నిర్మిస్తున్నట్టు సివిల్ సప్లయి కార్పొరేషన్ జిల్లా మేనేజర్ హెచ్‌వి జయరామ్ స్పష్టంచేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 633-7లో 0.39సెంట్ల విస్తీర్ణంలో ఎం ఎల్ ఎస్ పాయింట్ గొడౌన్‌ను నిర్మించేందుకు స్థలాన్ని జిల్లా మేనేజర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా టెక్నాలజీతో ఇక్కడి గిడ్డంగును నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే ఇచ్ఛాపురం, భామిని, జలుమూరు, కొత్తూరు, నరసన్నపేట, రేగిడి, సరుబుజ్జిలి మండల కేంద్రాల్లో పాతపద్ధతుల్లోనే గోదాములు నిర్మిస్తామన్నారు. సారవకోట, పోలాకి, కోటబొమ్మాళి కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రతిపాదనలు కోరినట్టు వివరించారు. మెళియాపుట్టి మండల కేంద్రంలోగల గిడ్డంగి తప్ప మిగిలిన చోట్ల అద్ద్భెవనాల్లోనే ఎఫ్‌పి షాపులకు కేటాయించిన నెలవారీసరుకులను భద్రపరుస్తున్నామని వివరించారు. ఈయనతోపాటు డిప్యూటీ తహశీల్దార్ బి.శ్రీహరి, రెవెన్యూ పరిశీలకులు బి.వెంకటేశ్వరరావు, వీఆర్‌వో జరుగుళ్ల వెంకటరమణ, సంధ్య తదితరులు ఉన్నారు.