శ్రీకాకుళం

నగరపాలక ఎన్నికల వేడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
వందేళ్ళు చరిత్ర కలిగిన శ్రీకాకుళం మున్సిపాలిటీ రాష్ట్ర విభజన తర్వాత జిల్లా కేంద్రాలన్నీ నగరపాలక సంస్థలుగా స్థాయి పెరిగిన క్రమంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి పాలనలో కొనే్నళ్ళుగా నడుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నగరపాలకసంస్థ ఎన్నికలు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రతికూలంగా ఉండడంతో ఎన్నికలు ఆగస్టు, సెప్టెంబరు మాసాలకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ, ఇంకా అధికార పార్టీ ఆశించిన అనుకూల వాతావరణం శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలకు లేవంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రిని ముందస్తు వ్యూహాన్ని స్వయంగా రచించాల్సిన అవసరం కల్పించాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం రూరల్, గార మండలాలతోపాటు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ముఖ్యంగా జిల్లా దేశం పార్టీ సర్వసభ్య సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా నేతలకు సమాచారం అందింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం నగరంలోనే సి.ఎం. సుడిగాలి పర్యటనకు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు అజెండా మాటున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సర్వసభ్య సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో క్యాడర్ అభిప్రాయాలను సేకరించి, తద్వారా ఆకర్ష్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టాలన్న వ్యూహాం కూడా లేకపోలేదు. బోణీగా పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ, తన అనుచరులు తప్ప మిగిలిన నియోజకవర్గాల నుంచి ఆకర్ష్ ప్రభావితం చేయలేదు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ ఎన్నికలు వచ్చేస్తుండడంతో శ్రీకాకుళంతోపాటు రాజాం నగరపంచాయతీలలో తమ అభ్యర్థులను గెలిపించుకునేలా జిల్లా నాయకత్వం సమష్టగా పనిచేసేందుకు ఈ పర్యటన దోహదపడేలా ఉండాలని ఇప్పటికే జిల్లా నేతలకు సి.ఎం. ముఖ్యఅనుచరులు చెప్పకనే చెప్పారట!
సార్వత్రిక ఎన్నికల సమయంలో కంచుకోటగా ఏర్పడిన దేశం పార్టీలో గ్రూపు తగాదాలు పెచ్చుమీరాయి. దీంతో జిల్లాలో మంత్రి, విప్, కళా గ్రూపులంటూ క్యాడర్‌లో అభద్రతాభావం నెలకొంది. ఇటువంటి సమయంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు వస్తున్నాయంటూ ముఖ్యంగా కళింగకోమట్లు ఓటు బ్యాంకుతోనే మేయర్ కుర్చీ కీలకం కావడంతో ఆ సామాజికవర్గాన్ని ఈ మూడు గ్రూపులు వారివారి వ్యూహాలతో కళింగకోమట్లను చీల్చారు. దీంతోనే సస్పెండ్ కావల్సిన పి.వి.రమణ సామాజిక ముసుగులో ఎన్నికలకు అత్యంత కీలకమైన పాత్ర పోషించేలా తయారు చేశారు. దీనివల్ల స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవిని ఇరకాటంలో పెట్టామన్న వాదన కూడా కొన్ని గ్రూపుల తమ్ముళ్ళు బహిరంగంగా చర్చిస్తున్నారు. అలాగే, నగరపాలక సంస్థ స్థాయి పెరిగిన తర్వాత ఇంటిపన్ను పెంపుదల, కుళాయి కనెక్షన్ల మంజూరులో జన్మభూమి కమిటీ సభ్యుల మితిమీరిన జోక్యం, బి.పి.ఎస్. విధానానికి స్థానికులు అవగాహన చేసుకోలేని పరిస్థితులు, అందుకు తెలుగుతమ్ముళ్ళు చేతివాటం, మంచినీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపం, అసంపూర్తిగా గల అభివృద్ధి పనులు... ఇలా ఏ కోణం నుంచి పరిశీలించినా అధికార పార్టీకి ఇక్కడ ఓటర్లు ప్రతికూలంగానే ఉన్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు ఇప్పటికే బాబు వద్దకు చేరాయని తెలుస్తోంది. దీంతోపాటు మేయర్ అభ్యర్థి ఎవరికివారే పేర్లు ఖరారు చేసుకుంటూ, గ్రూపుల గోల తీవ్రరూపం దాల్చేలా మారడంతో అధికారంలో గల దేశం పార్టీ నగరపాలక సంస్థ ఎన్నికలకు భయపడేలా చేసింది. ఇటువంటి ఆటంకాలను తొలగించుకుని క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించేందుకు ‘మేయర్’ పీఠం దక్కించుకునే దిశగా పోస్టుమార్టం చేయాలని సి.ఎం. నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సర్వసభ్య సమావేశంలో నేతలు నడిపే గ్రూపుల ముందు కార్యకర్తలు ఎవరికివారు అభిప్రాయాలు వెల్లడించేందుకు కూడా సిద్ధమేనంటున్నారు.

...........
రేపు ముఖ్యమంత్రి పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మే 2: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 4వ తేదీన జిల్లాలో ఉంటుందని, ఈ మేరకు సమాచారం అందిందని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం సోమవారం తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్ణయించిన మేరకు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దగల హెలిపాడ్ వద్దకు ఆ రోజు ఉదయం 10 గంటలు ముఖ్యమంత్రి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకూ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సింగుపురం గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకం, పంట సంజీవిని గుంటల తవ్వకం, అల్లి చెరువు పనులు పరిశీలన, కిల్లిపాలేంలో నిర్మించిన జాతీయ మంచినీటి ప్రాజెక్టును ప్రారంభోత్సం చేస్తారు. శ్రీకాకుళం, గార మండలాల్లోని 30 గ్రామాలకు ఉద్దేశించిన మంచినీటిని సరఫరా చేస్తారు. కోడిరామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణానికి శంకుస్థాపన, ఆదివారం పేటలోగల సప్తగిరి కల్యాణమండలంలో ఏర్పాటు చేసే నీరు-ప్రగతి వర్క్‌షాపులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం, కరవు రహిత జిల్లాగా చేసేందుకు నీటి సంరక్షణ చర్యలు, నీటి పరిస్థితిని సంపూర్ణంగా వివరించాలని, నీటి సంరక్షణకు అవసరమయ్యే చర్యలపై ప్రతిపాదనలు తయారు చేయాలని, ఛాయాచిత్ర ప్రదర్శన, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివిరంచాలని ఆయన అధికారులకు ఆదేశించారు. రాత్రి ముఖ్యమంత్రి బస చేస్తారని చెప్పారు.

ఉక్కబోత..
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మే 2: ఓవైపు ఠా రెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా హామీని మరచి అడపాదడపా కోతలు విధించడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సూర్యుడు ఉదయించకముందే ఇఎల్‌ఆర్ అంటూ సరఫరా నిలివేసి మధ్యాహ్నం 2.40 గంటలకు సరఫరా ఇవ్వడంతో ప్రజలు ఇక్కట్లపాలయ్యారు. ఉక్కబోతతో అల్లాడుతుంటే ఏదోఒక కారణం చెప్పి కోతలు విధించడం భావ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉత్పత్తి సంస్థల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగానే విద్యుత్తు సమస్య ఏర్పడిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసర కోతలు కన్నా ఏదో ఒక ప్రాంతంలో మరమ్మతులని, ఇతర సమస్యలని కోతలు విధించడం ప్రజలను బాధిస్తోంది. జిల్లాలో నాలుగు రోజులుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో కిమ్స్ ఆసుపత్రి ప్రాంతంలో ఆదివారం మరమ్మతులంటూ డి2 ట్రాన్స్‌కో ఇంజనీర్లు చెబుతుంటే-కలెక్టరేట్ వద్ద హెచ్.బి.కాలనీ వద్ద హైటెన్షన్ వైర్లుకు చెట్ల రెమ్మలుకొమ్మలు అడ్డంగా ఉన్నాయంటూ సాంకేతిక కారణాలను డి1 సబ్‌స్టేషన్ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇలా.. విద్యుత్ వస్తూ పోతుండటంతోపాటు గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోయారు. చెట్టుకొకరు, పుట్టకొకరు చేరి సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ అధికారిక కోతలేనని, విద్యుత్ అధికారులు మాత్రం ఉత్పత్తి సంస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగానే విధించినట్టు చెబుతున్నారని పలువురు వినియోగదారులు విమర్శిస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం, 800 విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటం, ఒడిశా గ్రిడ్‌లో 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తడంతో ఒక్కసారిగా విద్యుత్‌లోటు ఏర్పడిందంటున్నారు. సమస్య చాలా వరకు పరిష్కారమైందని అధికారులు చెబుతున్నారు. అయితే, కోతలు మాత్రం షరామామూలుగానే కొనసాగాయి. ఇవికాక సాధారణ రోజుల్లో కూడా పల్లెల్లో గంటలకొద్దీ నిలిపేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో మరమ్మతుల పేరిట ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు ఆపేస్తున్నారు.
జిల్లా విద్యుత్తు వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. సాధారణ రోజుల్లో 11 మిలియన్ యూనిట్లు ఉండాల్సిన వినియోగం ఎండలు కారణంగా 13 మిలియన్ యూనిట్లుకు పెరిగింది. వేసవి ఎండల నేపథ్యంలో సాధారణ వినియోగం గణనీయంగా పెరిగిపోతూ వస్తోంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఏసీలు, చెరువుల్లో ఏరియేటర్ల, పొలాల్లో మోటార్ల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో వినియోగం స్థాయి దాటిపోతుందని, వాటిని వీలైనంత తక్కువగా వాడేలా ప్రచారం చేయాల్సివుందని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. రెండు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అత్యవసర కోతలు విధిస్తున్నామని ఎపి ఈపిడిసిఎల్ ఎస్.ఇ. ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. అధికారికంగా కోతలు లేవని, విద్యుత్తు వినియోగం పెరగడంతో దానికి కావల్సినంత ఉత్పత్తి లేకపోవడంతో ఎమర్జన్సీ లోడ్ రిలీఫ్ చేయాల్సివస్తుందని వివరించారు. రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఉన్నతాధికారులు అంచనాల మేరకు ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని, అయినా నిరంతర విద్యుత్తు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
సమాజ శ్రేయస్సుకే
న్యాయవ్యవస్థ
* జిల్లా సివిల్ జడ్జి నిర్మలాగీతాంబ
నరసన్నపేట, మే 2: సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న పలు కేసుల విషయాల్లో అన్నింటా న్యాయంచేసేందుకు న్యాయవ్యవస్థ పనిచేస్తోందని జిల్లా జడ్జి నిర్మలాగీతాంబ స్పష్టంచేశారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక న్యాయస్థానాన్ని పరిశీలించేందుకు ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఒక్క న్యాయస్థానంలో ఎటువంటి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. స్థానిక న్యాయస్థానంలో బెంచ్‌కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సిబ్బంది కొరత కూడా ఎక్కువగా ఉందని దీని వలన పలు ఇబ్బందులు పడుతున్నామని బార్ కౌన్సిల్ సభ్యులు వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ త్వరితగతిన సిబ్బంది నియామాలకు శ్రీకారం చుడతామని బెంచ్‌కోర్టు ఏర్పాటుపై తగు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో స్థానిక మెజిస్ట్రేట్ ఎన్.సరస్వతీ, న్యాయవాదులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణ ప్రారంభం
బలగ, మే 2: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సోమవారం ప్రారంభమయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో క్రీడాశిబిరాలు ప్రారంభించగా, జిల్లా కేంద్రంలో ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, హాకీ, టేబుల్‌టెన్నీస్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్ తదితర క్రీడాంశాలకు సంబంధించి శిక్షణా శిబిరాలను ప్రారంభించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యం కలిగిన క్రీడాంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ శిబిరాలను కేటాయంచగా జిల్లా కేంద్రంలో అన్ని క్రీడాంశాల్లో వివిధ వేదికల్లో ఈ క్రీడాశిబిరాలను ప్రారంభించారు. కోడిరామ్మూర్తి స్టేడియంలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, టేబుల్‌టెన్నీస్, స్విమ్మింగ్, అర్చరీలకు సంబంధించి శిక్షకులు అందుబాటులో ఉండగా హాకీ, చెస్, బాక్సింగ్, సపక్‌టక్రా, జూడో, తైక్వాండో, వాలీబాల్, కబాడ్డీ,ఖోఖో, బాస్కెట్ బాల్, షటిల్‌బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, లాంగ్ టెన్నీస్, షూటింగ్ లకు సంబంధించి సీనియర్ క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయులను కేటాయించి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. అన్నిక్రీడాంశాలకు సంబంధించి క్రీడాపరికరాలను కొద్ది రోజుల్లో అందజేస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ తెలియజేశారు. ముఖ్యంగా అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీలకు సంబంధించి క్రీడాకారులు వందలాదిమంది చిన్నారులు మొగ్గు చూపుతున్నారు. అలాగే క్రీడాసంఘాలకు సంబంధించి శిబిరాలు నిర్వహిస్తుండగా అందులో క్రికెట్ కబడ్డీ,ఖోఖో వంటి క్రీడాంశాల్లో ప్రత్యేక తర్ఫీదును ఇస్తున్నారు. నెలరోజులపాటు జరిగే ఈ శిక్షణా శిబిరాలు చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తుందని క్రీడా సంఘాలు పేర్కొంటున్నాయి.

3 ఎస్ ఎస్ 21: ట్రిబిలింగ్ ద్వారా శిక్షణ పొందుతున్న చిన్నారులు

ప్రభుత్వ ఆఫీసుల్లో
ఇంకుడు గుంతలు
శ్రీకాకుళం(టౌన్), మే 2: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల తవ్వకంను పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉన్నతాధికారులతో ఆయన ముందుగా సమీక్ష నిర్వహించారు. 6న చేపట్టే ఇంకుడు గుంతల తవ్వకం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి పలువురు ఫోన్‌లో వినతులు అందించారు. నాగావళి నది నీటిని పలువురు అక్రమంగా వినియోగిస్తున్నారని, వారిపై క్రిమినల్ చర్యలు