శ్రీకాకుళం

మాతాశిశు మరణాల నివారణకు చర్యలు: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 12: జిల్లాలో మాతా శిశు మరణాలు లేకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశమందిరంలో శనివారం డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ ఎం.శ్యామల అధ్యక్షతన రాష్ట్రంలో నవజాత శిశువుల (ఏపి న్యూ బోర్న్) కార్యక్రమంపై కార్యాచరణ ప్రణాళిక పట్ల వర్కుషాపు నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లులు, ఏడాది కూడా పూర్తికాకుండా శిశువులు చనిపోవడం బాధాకరమన్నారు. గత ఏడాది జిల్లాలో 594 మంది శిశువులు, 34 మంది తల్లులు మృతిచెందారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు సమాజంలో మంచివి కాదంటూనే నిరపేద దేశాల్లో సైతం ఆరోగ్యం విషయంలో మనకంటే గణనీయమైన ప్రగతి సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని సరైన గణాంకాలను సమకూర్చుకుని వాటిని పక్కాగా విశే్లషించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏడాది గడవకముందే శిశువులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోందని, దీనికై నివారణ చర్యలను అనే్వశించాలని సూచించారు.
గర్భిణులను ముందుగా గుర్తించి తక్షణం వారికి అవసరమైన పౌష్టికాహారం, టీకాలు, ఇతర మందులు సరఫరాలో పూర్తి సహకారం ఉండాలని పేర్కొన్నారు. ముందుగా జ్యోతిప్రజళ్వనతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ టి.గీతాప్రసాదిని, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.వీరభద్రస్వామి, రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సునీల్‌నాయక్, ఎడి ఎంహెచ్‌వో డాక్టర్ ఎం.శారద తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి కృషి
ఎచ్చెర్ల, డిసెంబర్ 12: మత్స్యకారుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి స్పష్టంచేశారు. శనివారం రాత్రి డి మత్స్యలేశం గ్రామంలో నిర్వహించిన జనచైతన్య కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తీర గ్రామాల్లోని గంగపుత్రులను ఆదుకునేందుకుహుదూద్ పథకం కింద పక్కా ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా చేపల నిల్వచేసేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లను నెలకొల్పడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధికి పోర్టులు ప్రధానంగా నిలుస్తాయని బానవపాడు, కళింగపట్నం కేంద్రంగా
నిర్మాణాలు సాగించేందుకు ప్రతిపాధనలు సిద్ధంచేయడం జరిగిందన్నారు. దీని వలన మత్స్యకార యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. తీర ప్రాంతంలో పరిశ్రమలు పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయన్నారు. విపత్తుసమయాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించకుండా గ్రామాలకు రోడ్లు, తుఫాన్‌షెల్టర్లు, చేపల నిల్వచేసేందుకు గిడ్డంగుల నిర్మాణాలు సాగిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీఅధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, సర్పంచ్ మంగమ్మ, కొర్లయ, వి. యర్రయ్య, రాంబాబు, కృష్ణారావు, సాదు మల్లేసు, బోర వెంకటరావు ఉన్నారు.