శ్రీకాకుళం

తపోవన పారాయణ సప్తాహజ్ఞాన యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (కల్చరల్), అక్టోబర్ 18: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 91వ జయంతి, అవతారప్రకటన దినోత్సవ సందర్భంగా ఈ నెల 20 నుంచి 27 వరకు తపోవన పారాయణ సప్తాహ జ్ఞానయజ్ఞం అత్యంత వైభవంగా జరపడానికి సంకల్పించినట్టు రాష్ట్ర సత్యసాయి సేవాసమితి ఉపాధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు చెప్పారు. మంగళవారం స్థానిక సత్యసాయి పెద్దమందిరంలో విలేఖర్లతో మాట్లాడారు. తపోవన పారాయణ గ్రంథాన్ని శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వరశాస్ర్తీ రచించారని ఈ గ్రంథపారాయణం వల్ల ఫలశ్రుతి కలుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా యువచైతన్యభారతి కార్యక్రమాలు ఈనెల 20 నుంచి 27 వరకు జరుగుతాయని జిల్లా సత్యసాయి సేవాసమితి అధ్యక్షుడు గంగుల రమణబాబు తెలిపారు. ఈనెల 23న ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వరా కళాశాలలో యువతకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి ఒక్కరోజు ఒరియంటేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ ఎల్.లక్ష్మణరావు, ఎస్.రామచంద్రరావు, ఎన్.సూర్యనారాయణ, నాగభూషణరావు, గుప్తా, సూరిబాబు, కె.మురళీకృష్ణ పాల్గొన్నారు.

నాగావళి నదిలో మృతదేహం
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 18: పట్టణానికి చెందిన కరణం హేమంత్‌కుమార్(18) అలియాస్ అయ్యప్ప మృతదేహం మంగళశారం నాగావళి నదీ తీరంలో లభ్యమైంది. హేమంత్‌కుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో బిబిఎ చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి 3గంటల సమయంలో ప్రాజెక్ట్ వర్కు ఉందని బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదని తల్లి సుజాత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మంగళవారం నదీ తీరంలో మృతదేహం ఉందన్న పోలీసులు సమాచారం ఇవ్వడంతో సుజాత తీరానికి వెళ్లి చూసి తన కుమారుడు మృతదేహంగానే గుర్తించింది. మరణించడానికి గల కారణాలు తెలియరావడం లేదు. ఎఎస్‌ఐ రఘునాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.