శ్రీకాకుళం

బినామీలకు ఉగ్ర ‘నృసింహం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
నల్లధనం దాచుకునే కుబేరుల తాటతీస్తానంటూ నెలరోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు అస్త్రం భారతదేశ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో...శ్రీకాకుళంలో పేదోళ్ళ ఇళ్ళు బినామీల చేతుల్లోకి తీసుకుని అనుభవిస్తున్న వారిందరిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతానని, వాంబే, రాజీవ్‌గృహకల్ప గృహాల్లో అద్దెకు నివాసం ఉంటున్న వారికే ఆ ఇంటి యజమానిగా చేసేస్తానంటూ జారీ చేసిన జిల్లా కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారి హుకుం నగరంలో సంచలనం కలిగించింది. బినామీలకు..ఉగ్ర‘నృసింహం’గా మారుతానంటూ కలెక్టర్ ఇటీవల రాష్ట్ర గృహనిర్మాణశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో చేసిన ప్రతిజ్ఞ కార్యరూపం దాల్చింది! గత రెండు రోజులుగా ఇక్కడ కలెక్టర్ కార్యాలయం దగ్గరలో 80 అడుగుల రోడ్డులో గల వాంబే, రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో ప్రభుత్వం నుంచి పట్టాలు తీసుకున్న వారు కాకుండా, ఇతరులు ఎవరు నివాసం ఉంటున్నారన్న అంశంపై విజిలెన్స్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. వీరితోపాటు, రుణాలు ఇచ్చిన బ్యాంకు అధికారులు కూడా ఇంటి యజమాని అడ్రస్సు లేకుండా వారు అమ్మేసిన, తనఖాపట్టిన, అద్దెకు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నివేదికలన్నీ డిసెంబరు 30 నాటికి కలెక్టర్ చేతికి చేరినవెంటనే అద్దెకు ఉంటున్నవారికే ఆ గృహాలు సొంతం చేసేవిధంగా ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ హోదాలో నిర్ణయాలు తీసుకునేందుకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం అడుగులు వేస్తున్నారు. పూర్తిస్థాయిలో నల్లధనాన్ని ఊడ్చేయడానికి డిసెంబరు 30 తారీఖు మోదీ ప్రకటించిన నాటికే శ్రీకాకుళం జిల్లాలో పేదోడికి ప్రభుత్వం ఇచ్చిన గృహాల్లో వారే ఉండాలన్న కఠిన నిర్ణయానికి గడువు ఇవ్వడం గమనార్హం. బినామీలు చేతిల్లోకి ప్రభుత్వ పథకాలు వెల్లకుండా అడ్డకట్టువేయడమేకాకుండా, నిజమైన పేదలకు న్యాయం చేసే ప్రక్రియకు ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై దారిద్య్రరేఖకుదిగువనున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నిర్ణయం అమలుజరిగితే - పట్టణ పేదల మదిలో చిరకాలం మెసిలే ఛాన్స్ ఆయనకే దక్కుతోంది. ఇప్పటికే, పి.ఎన్.కాలనీ రిజర్వు స్థలాల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేసి సంబంధిత అధికారులను పరుగులుపెట్టించి బినామీలపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కేబినేట్‌లో కీలక అమాత్యునిగా అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం పట్టణంలో గల నిరుపేదలకు పక్కా ఇళ్ళు నిర్మించాలన్న లక్ష్యమే వాంబే, రాజీవ్ గృహకల్ప, అర్బన్ హౌసింగ్ పథకాలు. పదవులు అశాసత్వమని, దీర్ఘకాల ప్రయోజనాలు కల్పించే పనులే శాశ్వతమని ధర్మాన మున్సిపాలిటీ వార్డుల్లో పేదోళ్ళకు డ్రా విధానంలో ఇళ్ళు కేటాయించిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే, కొంతమంది లబ్దిదారులు తప్పుడు నివేదికలతో వీటిని సొంత చేసుకుని ఆర్థిక ప్రయోజనం గత పదేళ్ళుగా పొందుతూవస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ బినామీలపై ఉక్కుపాదం మోపారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం నగరంలో అత్యంత అధిక ధరలు కలిగిన వాంబే, రాజీవ్ గృహకల్ప గృహాలుగా 1187 మందికి జిల్లా యంత్రాంగం పట్టాలు ఇచ్చింది. దీనికిగాను ఎస్‌బీఐ (ఎడీబి), ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ఆ గృహాలు అనుభవిస్తున్న పేదోళ్ళు కొన్నాళ్ళు తర్వాత బినామీల చేతుల్లో చిక్కుకుని ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఇచ్చిందో ఆ దిశగా వారంతా ఇంటి యజమానులుగా ఉండలేకుండా చేసిన బినామీలపై కలెక్టర్ ఇప్పుడు కనె్నర్ర చేసారు. మరికొద్దిరోజుల్లో పట్టాలు తీసుకుని, బ్యాంకు రుణాలు ఎవరిపేరుమీద ఉందో వారే ఆ గృహాల్లో నివాసం ఉండాలని, లేనిపక్షంలో అద్దెకు ఉన్నవారికే ఆ గృహ యజమానులుగా పట్టాలు ఇచ్చేస్తామన్న కలెక్టర్ హుకుం రెండురోజులుగా హౌసింగ్‌శాఖ అధికారులు దండోరా వేయిస్తున్నారు. డిసెంబరు 30 తర్వాత బినామీలపై క్రిమినల్ కేసులు ఖాయమంటూ అధికారులు హాడలెత్తిపోతున్నారు. గృహనిర్మాణశాఖ అధికారుల మెతకవైఖరి, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో పేదోళ్ళ గృహాల్లో మకాం వేసి బినామీలకు...కలెక్టర్ ఉగ్ర‘నృసింహమే’ అంటూ దండోరా వాంబే కాలనీలో వేయించడం గమనార్హం!

పవాహనదారులకు తీపి కబురు
ఎచ్చెర్ల, డిసెంబర్ 3: ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేయడంతో చిల్లర సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్‌ప్లాజాలకు గత 22 రోజుల పాటు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 9 నుండి 25వరకు తొలుత టోల్‌రుసుము వసూలు చేయవద్దని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ చిల్లర సమస్య సర్థుమనగపోవడంతో డిసెంబర్ 2 అర్థరాత్రి వరకు పొడిగించిన విషయం విధితమే. టోల్‌ప్లాజా సిబ్బంది శుక్రవారం అర్థరాత్రి నుంచి పన్ను వసూళ్లకు సమాయత్వమయ్యారు. అయితే పాత రూ.500నోట్లను కూడా ఈనెల 15వరకు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వాహన దారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని చిలకపాలెం, మడపాం, లక్ష్మీపురం, ఇచ్ఛాపురం టోల్‌ప్లాజాలవద్ద నుంచి రూ.500నోట్లను స్వీకరిస్తున్నప్పటికీ కనీసం రూ.200 రుసుము చెల్లిస్తేనే అన్న నిబంధన కూడా సిబ్బంది అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా వాహన చోదకులకు చిల్లర కష్టాలు తీరినట్లయ్యింది. గత 22 రోజుల పాటు టోల్‌ప్లాజాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం వలన సుమారు రూ.15కోట్లు జిల్లా నుంచి కేంద్రప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది.

నగరాభివృద్ధికి మరో రూ. 35 కోట్ల నిధులు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, డిసెంబర్ 3: నగరపాలక సంస్థ అభివృద్ధికి మరో 35 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండున్న ఏళ్ళ తన పాలనలో తొలి విడతగా రూ. 28 కోట్లు విడుదల చేయగా, మలివిడతగా రూ. 35 కోట్లు విడుదల చేసినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి చెప్పారు. వౌలిక మంత్రమే ప్రాధాన్యతగా చేస్తున్న పనులకు ఈ నిధులు కేటాయింపులు చేస్తున్నట్టు వివరించారు. ఆమె ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జనచైతన్యయాత్రలో భాగంగా ఇటీవల నగరంలో చేసిన పాదయాత్ర సందర్భంగా తాను నగరాభివృద్ధికి నిధులు కావాలంటూ కోరిన మీదట, శనివారం రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అమరావతి నుంచి ఫోన్లో మాట్లాడుతూ శ్రీకాకుళం నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి సూచనల మేరకు రూ. 35 కోట్లు మంజూరు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నగరంలో రోడ్లు, కాల్వల నిర్మాణాలతోపాటు, ప్రజలకు వౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. వార్డులవారీగా ప్రాధాన్యతాపరంగా పనులు చేపట్టి నగరాభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్టు చెప్పారు. నవ్యశ్రీకాకుళం నిర్మాణానికి ఈ నిధులు ఎంతో దోహదపడతాయన్నారు. స్వచ్ఛ శ్రీకాకుళంగా సాగించేందుకు కూడా ఈ నిధులు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, కమిషనర్ పి.ఎ.శోభ నివేదికల ఆధారంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో మరో ఏడాదిలోగా సరికొత్త సిక్కోల్ నిర్మిస్తామని లక్ష్మీదేవి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండున్నర ఏళ్ళులో జరిగే అభివృద్ధి పనులు గడచిన పదేళ్ళులో అప్పటి ప్రభుత్వం చేయలేకపోయిందన్నారు. నిధులు మంజూరు చేయడంలో టిడీపీ ప్రభుత్వం ప్రజావసారాలను గుర్తించి సరైన సమయంలో సకాలంలో పనులు పూర్తి చేసేందుకువీలుగా సాంకేతి, ఆర్థిక అవంతరాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పురపాలకశాఖ మంత్రి నారాయణలకు నిధులు మంజూరు పట్ల కృతజ్ఞతలు తెలిపారు.గి

రిజన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
పాతశ్రీకాకుళం, డిశెంబర్ 3 : గిరిజనుల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ఉన్నతన్యాయస్థానాల తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జాతీయన్యాయసేవాధికార సంస్ధ సౌజన్యంతో జిల్లా న్యాయసేవాధికారసంస్ధ ఆధ్వర్యంలో శనివారం గిరిజనుల హక్కుల పరిరక్షణ పధకంపై అవగాహనా సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా గిరిజనులు వెనుకబడి ఉన్నారన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని వారి పరిష్కారానికి అధికారులు చిత్తశుధ్ధితో పనిచేయాలన్నారు. గిరిజనులు అభివృద్ధి మార్గంలోకి పయనించేలా ప్రభుత్వం చొరవచూపి పలు చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల విశాఖజిల్లా పాడేరులో నిర్వహించిన గిరిజన సదస్సులో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. త్రాగునీరు, ఆహారపదార్ధాల కల్తీ, గృహకల్పన తదితర అంశాల్లో గిరిజనుల పరిస్ధితులు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. వీటిపై అక్కడి గిరిజనుల్లో చైతన్యం కలిగించామన్నారు. జిల్లాలో 1.64 లక్షల మంది గిరిజనులున్నారని వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వి. యన్ చక్రధరబాబు భూ బదలాయింపుచట్టం, గిరిజనులకు అందించే పలు సంక్షేమ ఫధకాలు, అటవీ చట్టాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గిరిజన అధ్యయన సంస్ధ మాజీ సంచాలకులు డా.వి. ఎన్.కె.వి శాస్ర్తీ మాట్లాడుతూ గిరిజనుల్లో మానవహక్కుల ఉల్లంఘల అతిపెద్ద సమస్యగా ఉందన్నారు. అనవసరంగా వారిని కేసుల్లో దోషులుగా చేరుస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా సమస్యలను గ్రామసభల ద్వారానే పరిష్కారమవుతున్నాయన్నారు. వారికి విద్యాహక్కు చట్టం అమలయ్యేలా జిల్లా న్యాయసేవాధికార సంస్ధ ప్రత్యేకశ్రద్ద చూపాలన్నారు. ఈసదస్సులో ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికారిత సంస్థ సభ్యకార్యదర్శి పి.రాంబాబు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూ.గో,ప.గో జిల్లా న్యాయసేవాధికారిత సంస్థల కార్యదర్శులు ఏ.మేరీగ్రేస్‌కుమారి, ఆర్.వి నాగసుందర్, ఎం.శ్రీహరి, ఎల్.వెంకటేశ్వరరావు, ఏ.నరసింహమూర్తి, శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమీషనర్ పి.ఏ శోభ, జెసి-2 పి.రజనీకాంతారావు, జిల్లా డిఆర్‌డిఏ పిడి జిసి.కిషోర్‌కుమార్, ఆర్డివో బలివాడ దయానిధి, ఎం.వెంకటేశ్వరరావు, డివిజనల్ అటవీ అధికారులు లోహితాస్యుడు, సిహెచ్ శాంతిస్వరూప్, డి ఈవో దేవానందరెడ్డి, డిఎంఅండ్ హెచ్ వో ఎస్.తిరుపతిరావు, కె.తిరుమలరావు, ఎల్.పెంటారావు, సుబ్రహ్మణ్యం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంజీవరావు, ప్రసాదరావు, కృష్ణారావు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగులందరికీ
పింఛన్లు
* కలెక్టర్ లక్ష్మీనృసింహం
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 3: జిల్లాలో అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. శనివారం స్థానిక బి ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించిన 57వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. 2017 జనవరిలో 3.5లక్షల మందికి కొత్తగా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో వికలాంగుల పింఛన్లు పొందని వారు ఎవరైనా ఉంటే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు. తమ పేరు పల్స్ సర్వేలో నమోదు అయి ఉండాలన్నారు. ఒకవేళ సర్వేలో తమ పేరు నమోదు కానివారు ఎవరైనా ఉంటే అటువంటి వారు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం పింఛన్‌దారులకు పింఛన్లు అందుతున్నదీ, లేనిదీ కలెక్టర్ దివ్యాంగులను అడిగి తెలుసుకనున్నారు. సకాలంలో పింఛన్లు అందని వారు ఉంటే విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులను కలవాలని సూచించారు. అక్షరజ్ఞానం ప్రతీ ఒక్కరికీ అవసరమని ఆ దిశగా విద్యను అభ్యసించాలన్నారు. దివ్యాంగులు క్రీడల్లోనూ రాణిస్తున్నారని వారికి తగిన తర్ఫీదు ఇవ్వడం ద్వారా సకలాంగుల కంటే మెరుగైన పథకాలు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె వి ఆదిత్యలక్ష్మీ, డి ఎస్ డి ఏ శ్రీనివాస్‌కుమార్, లెక్చరర్ జనార్థననాయుడు, వి.జగన్నాధంనాయుడు, వివిధ మనోవికాస్ కేంద్రాల నిర్వాహకులు విద్యార్థులు పాల్గొన్నారు.
18న మహారుద్రాభిషేకం
శ్రీకాకుళం(రూరల్), డిసెంబర్ 3: ఈనెల 18న లోకకళ్యాణార్థం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో మహారుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు విశాఖ కళింగకోమటి సంఘం అధ్యక్షుడు లాడి కిషోర్‌కుమార్ తెలియజేశారు. స్థానిక హోటల్‌గ్రాండ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిమాలయ సాధువులతో ఉన్న సత్సాంగత్యం వలన అనునిత్యం చేస్తున్న అన్నదానాలు, అనాదశవ అంతిమ సంస్కారాలు వంటి ఉన్నత సేవా కార్యక్రమాలు చేస్తున్న సత్యప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ గత మూడేళ్ల కిందట ఈ మహారుద్రాభిషేకాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇటువంటి అపూర్వ అవకాశం మరలా లభించిందన్నారు. శ్రీకాకుళం ప్రజానీకానికి ఆయురారోగ్య , ఐశ్వర్యాలు భక్తి జ్ఞాన వైరాగ్యములతోపాటు ప్రస్తుతం సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల నుండి అందరికీ కాపాడాలనే సదుద్ధేశ్యంతో ఈ అద్భుత ఘట్టాన్ని శ్రీకాకుళంలోనే జరిపించాలని ట్రస్ట్‌వారిని కోరినట్లు తెలియజేశారు. ఈనెల 18న సాయంత్రం ఖచ్చితంగా 6:05గంటల నుండి 7:50గంటల వరకు మహారుద్రాభిషేకాన్ని జరిపిస్తున్నామన్నారు. ఈ సృష్టిలో సర్వప్రాణికోటి ఆనందంగా జీవించాలని సమస్తమానవకోటి ఆయారారోగ్యాలు కలిగి ఉండాలనే సంకల్పంతో రుద్రునికి ప్రీతీకరమైన పవిత్ర పుణ్య నదీ జలాలతో, పుష్పములతో, మధుర ఫల రసాలతో కోట్ల నామసంకీర్తనలతో హిమాలయ నాగసాదువులకు శిశ్యులైన దాదాపు 60మంది నిస్వార్థ కఠిన దీక్షాపరులతో కలియుగంలో వివేష ఫలితాన్నిచ్చే మట్టి శివలింగరూపంలో కొలువు తీరిన ఏడు అడుగుల రుద్రునికి రుద్రాభిషేకం చేయనున్నట్లు తెలియజేశారు. విలేఖర్ల సమావేశంలో అందవరపు సూరిబాబు, దుప్పల వెంకటరావు, ప్రధాన ఆదినారాయణ, వానపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతులకు ప్రభుత్వం బాసట
* ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి
నరసన్నపేట, డిసెంబర్ 3:రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ఆదుకునే దిశగా అన్ని చర్యలను చేపట్టడం జరుగుతుందని వారి ఉన్నతాభివృద్ధికి సహకారం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక పశువైద్యశాలలో పాడి రైతులకు పశుదానా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 11 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందని దీనిలో భాగంగా నరసన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాడి రైతులకు పశువుల దానా కిలో రూ.4లకే అందించే విధంగా సాహకారం చేపట్టిందని వివరించారు. 60 కిలోల బస్తా రూ.954 కాగా 75శాతం రాయితీతో కేవలం రూ.240లకే దీనిని అందజేస్తున్నామని సుమారు 5నుండి 6వేల బస్తాలను పంపిణీ చేస్తామని ఆయన స్పష్టంచేశారు. అనంతరం పాడి రైతులకు పశుదానా బస్తాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యశాఖ ఏడి హరినారాయణ, పశువైద్యాధికారి సంతోష్‌కుమార్, జెడ్పిటీసీ శకుంతల, సర్పంచ్ జి.చిట్టిబాబు, పోలాకి మండల ఎంపిపి లక్ష్మీభూషణరావు, అధికారులు, ఎంపిటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల మేన్‌ఫేస్టోని మరచిన బాబు
జలుమూరు, డిసెంబర్ 3: ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మేన్‌ఫేస్టోలో ఉన్న హామీలను విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం యలమంచిలి గ్రామంలో శనివారం సాయంత్రం చేపట్టిన గడపగడపకు వైకాకా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలను మోసగించి ఎన్నికల్లో అనేక వాగ్ధానాలిచ్చి అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతి, బాబు వస్తే జాబ్ కార్యక్రమం, పూర్తిస్థాయిలో రుణమాఫీ నేటికీ జరగలేదని అక్కడ మోదీ ఇక్కడ బాబు పెద్దనోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసగిస్తూ ప్రజలు పడుతున్న బాదలను నేటికీ అర్థం చేసుకోవడంలేదని ఆందోళన చేశారు. మేన్‌ఫేస్టో హామీలను నెరవేర్చలేదని, పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలు ఇన్నీ అన్నీ కావన్నారు. ఇప్పటికీ పనులు మానుకొని ఇంటి సమస్యలను విడిచిపెట్టి బ్యాంకులు, పోస్టుకార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సమయం సరిపోతుందని ప్రజలచే ఎన్నుకోవడిన ప్రభుత్వాలు ప్రజాసమస్యలపై విస్మరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతోపాటు ఎంపిపి ప్రతినిధి కొయ్యాన సూర్యారావు, జెడ్పిటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, వైకాపా ప్రతినిధులు పైడి విఠల్‌రావు, మూకళ్ల సత్యన్నారాయణ, వెలమల అసిరినాయుడు, సతీష్, బుక్క లక్ష్మణరావు, పలువురు పాల్గొన్నారు.
వేతనదారులకు పనులు కల్పించాలి
ఎమ్మెల్యే కళావతి
వీరఘట్టం, డిసెంబర్ 3: మండలంలోని ఉపాధి వేతనదారులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించి వలసలు నివారించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శనివారం వండువ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభకు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ పంచాయతీలో వండువ, శృంగారాయపురం, పాపంపేట గ్రామాలకు సంబంధించి కోటి 30 లక్షలు విలువైన 19 పనులను ఈ సందర్భంగా గుర్తించారు. ఈ పనులన్నీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుర్తించినట్టు తెలిపారు. అలాగే వేతనదారులకు వేతనాలు చెల్లింపులు జాప్యం లేకుండా అందరికీ చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ ఏపి ఒ సత్యంనాయుడు, ఎంపిటిసి మనోహరమ్మ, సర్పంచ్ విజయకుమారి, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.