శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 19: ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో జిల్లాకు అపారనష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ ఎం జానకి అన్నారు. శనివారం ఆమె గూడూరు మండలం వేములపాలెంలో వరద ముంపునకు గురైన వరద బాధితులకు అనంతపురం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అందచేసిన ఫల సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాను వరదలు ముంచెత్తాయని, అన్నివర్గాల వారికి అపార నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వపరంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకున్నట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలు కీలకపాత్ర పోషించాయని ప్రశంసించారు. పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం తమవంతు సాయం అందించినా స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులను ఆదుకొనడంలో ముందుకు వచ్చినందుకు వారిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గిరీషా, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ, ఎండివో భవానీ, నెలబల్లి భాస్కరరెడ్డి, సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబర్ 19: భర్తపై మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాఘవరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పచ్చా పద్మనాభరెడ్డి భార్య మాధవి (34) అనే వివాహిత శనివారం ఉదయం భర్తకు టీ ఇవ్వబోయింది. కానీ భర్త టీ తాగేందుకు నిరాకరించి ఇంటి నుండి బయటకు వెళ్లబోతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు అతడిని ఇంటి నుండి వెళ్లవద్దని మొర పెట్టుకున్నప్పటికీ వారి మాటలను లక్ష్యపెట్టకుండా బయటకు వెళ్లిపోయాడు. అనంతరం మాధవి కోపంతో గది లోపలకు వెళ్లి తలుపులకు గడియపెట్టింది. దీంతో తలుపులు తెరవమని ఆమె తల్లిదండ్రులు కోరినా ఎంతకీ తెరవకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించారు. కొనవూపిరితో ఉన్న మాధవిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె మృతి చెందినట్లు ఆమె తండ్రి వెంకటరమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.