శ్రీకాకుళం

రాజాంలో విద్యార్థి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం, ఫిబ్రవరి 1: ఇక్కడి జిఎన్‌ఆర్ కళాశాల పై అంతస్తులో మరిచర్ల తేజ(20) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సోమవారం ఉదయం కళాశాల నిర్వాహకులు దీన్ని గుర్తించారు. తేజ ఈ కళాశాలలో బిఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం రాముడువలసకు చెందిన ఈ విద్యార్థి ఎప్పటిలాగే కళాశాలకు ఉదయం 7.30 సమయంలో వచ్చినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ విద్యార్థి పై అంతస్థులోని భోజనశాలలో ఒక వైరుతో మెడకు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించాడు. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని తల్లిదండ్రులు అప్పలనాయుడు, కమల, బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామం నుంచి వందలాది మంది కళాశాలకు చేరుకుని ఇది హత్య అయినప్పటికీ, దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. రాజాం సిఐ శంకరరావు సారధ్యంలో ఎస్సైలు, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతుని బంధువులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సాయంత్రానికి కూడా సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పటికీ మృతదేహం యథాస్థితిలో ఉండటంతో కళాశాల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు భయాందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో డాగ్‌స్వ్కాడ్ రంగ ప్రవేశం చేసి కళాశాలలోని అన్ని గదులను నిశితంగా పరిశీలించారు. ఇది హత్య ఆత్మహత్యా అనే నిజాలు పిఎంలో తేలుతుందని పోలీసులు వివరిస్తున్నప్పటికీ మృతుడు కుటుంబ సభ్యులు శాంతించలేదు. అనుమానాస్పద కేసు కింద నమోదు చేస్తున్నామని సిఐ శంకరరావు తెలిపారు.
మందసలో
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మందస: మండలంలో బుడంబో గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వై.తేజ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబీకులు తెలిపారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయానికి తేజ కనిపించకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వెతికి బాత్‌రూమ్‌లో అపస్మారకస్థితిలో గొంతును బ్లేడ్‌తో కోసుకొని పడి ఉండడంతో గమనించి బుడంబో పిహెచ్‌సి వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ నుంచి విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నప్పుడు నన్ను చంపేయాలని చేతిరాతలు రాస్తుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తేజకు ఫోన్‌కాల్ రావడంతో కొంతసేపు తర్వాత ఈ చర్యకు పాల్పడినట్టు విద్యార్థినిలు వెల్లడించారు. తండ్రి కామరాజు
అనకాపల్లిలో కర్రెలడిపోలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తల్లి రెండేళ్లు కిందట మరణించిందని అక్క పద్మావతి, రజనీలు తెలిపారు. హెచ్‌ఎం హరికృష్ణ, ఐటిడిఎ పివో మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టౌన్‌హాల్ క్లబ్‌పై
వైకాపా నేతల స్పందన ఏది?
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 1: పట్టణంలోని ప్రజలు వినియోగించాల్సిన టౌన్‌హాల్ క్లబ్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మాటలు తాము అందజేసిన సాక్ష్యాలతో ఎందుకు మూగబోయాయని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ప్రశ్నించారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల వినియోగార్థమై అప్పటి పర్లాఖిమిడి రాజులు టౌన్‌హాల్ క్లబ్ స్థలం ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు. అయితే, అందులో గతంలో సుదీర్ఘకాలం ట్రస్టు సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ క్లబ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకోవడం భూకబ్జా కాదా అంటూ మండిపడ్డారు. ప్రజా తీర్పుకోసం క్లబ్ విషయంలో బహిరంగ చర్చకు రావాలంటూ ఆహ్వానించిన పార్టీ నేత, న్యాయవాది శిమ్మ రాజశేఖర్ చర్చ విషయంలో ఎందుకు వౌనంగా ఉన్నారన్నారు. తమ నేత మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ధర్మానతో బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తాము చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రజాతీర్పు కోసం తాము సిద్ధంగా ఉన్నామని, దస్త్రాలు మార్చి కబ్జాకు పాల్పడిన వైకాపా నేతలు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సమావేశంలో మాజీ డిసిసిబి అధ్యక్షుడు సింతు సుధాకర్, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, నేతలు ఎస్.వి.రమణ మాదిగ, శీర రమణ, జి.వి.రమణమూర్తి, ఐ.తిరుమలరావు, మూవూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నేడు సిక్కోల్‌లో జగన్..
యువభేరి
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సంగతిని వీడలేదు. విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం దిక్కుతోచని స్థితిలో ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి ఉంటుందని వైకాపా భావిస్తూ వస్తోంది. ఇందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయక ప్రత్యేక ప్యాకేజీ అంటూ బుజ్జగిస్తున్నా ప్రతిపక్షం తన పట్టును మాత్రం బిగిస్తోంది. ఇందులో భాగంగానే తమవంతుగా రాష్ట్రంలో వివిధ చోట్ల ‘యువభేరి’ పేరిట యువతీయువకులతో కార్యక్రమాలు పెడుతూ ప్రజల్లోకి వెళుతోంది. ఈ ఆలోచన వెనుక రాజకీయ ప్రయోజనం ఉన్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత దిక్కులేనివాళ్ళం అయ్యామంటూ వైకాపా నేతలు చేపడుతున్న ఆందోళనకు యువత నుంచి స్పందన వస్తోంది. తాజాగా మంగళవారం ఇదే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. తుని దుర్ఘటన నేపథ్యంలో పట్టణంలో ర్యాలీలు నిషేధించడంతో వైకాపాకు అధికార పార్టీ నుంచి మొదటి దెబ్బ తగిలిందని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి, కేవలం సమావేశానికే మాత్రమే అనుమతులు జారీ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ఏలా విజయవంతం చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన పత్రిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ‘యువ’ అస్త్రాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై సంధించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు.
ప్రత్యేక హోదా ప్రాధాన్యతను యువతకు తెలియజెప్పి తద్వారా ఓటు బ్యాంకును మరింత సంపాదించుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ యువమంత్రాన్ని ప్రధాని నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా జపించగా అదే ట్రెండ్‌ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొదలు జగన్మోహనరెడ్డి వరకు ఫాలో అవుతున్నారు. ఇందుకు నిదర్శనం నిన్న సెంట్రల్ వర్శిటీలో జరిగిన రోహిత్ ఆత్మహత్యకు కులం రంగుపులిమి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా పరామర్శలు ఓదార్పులు దీక్షలకు సంఘీభావాలు కొనసాగించడమే! ఇలా నేతలు పోటాపోటీగా ఒకరిపంథాను ఒకరు కాపీ కొడుతూ భవిష్యత్‌లో రాజకీయ ప్రయోజనం పొంది అధికారాన్ని అందిపుచ్చుకోవాలన్న తపన పడుతున్నారు. ఇందులోభాగంగా ఉద్యమాలు పురిటి గడ్డగా పేరున్న శ్రీకాకుళాన్ని ఎంచుకుని జగన్మోహనరెడ్డి వేలాదిమంది యువతను పాల్గొనేలా చేసి, ‘యువభేరి’తో తన సత్తాను అధికార పార్టీకి తెలిపేందుకు రంగం సిద్ధం చేశారు.
ఆంధ్ర రాష్ట్రం విడిపోవద్దంటూ యువత గర్జించింది. సమైఖ్యాంధ్ర కోసం పోరాడే అన్ని రాజకీయ పార్టీ లతో యువకులు గొంతు కలిపారు. 2013లో సమైఖ్యాంధ్ర ఉద్యమం అంత స్థాయిలో తీవ్రంగా జరిగిదంటే అందులో యువత పాత్రే కీలకం. రాష్ట్రం సమైఖ్యంగా ఉంటే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గట్టిగా నిలదీశారు. అప్పట్లో సమైఖ్యాంధ్ర కోసం వైకాపా కూడా గట్టిగా పోరాడటంతో వారితో కలిసి యువకులు పోరాడినా రాష్ట్రం విడిపోక తప్పలేదు. పోనీ - తరువాత రాష్టవ్రిభజన జరిగినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దీంతో అన్ని వర్గాల వారు కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటిస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సిక్కోల్ పట్టణ నడిబొడ్డున టౌన్‌హాల్ గ్రౌండ్స్‌లో జగన్ యువభేరి కార్యక్రమం ఆరంభం కానున్నది. ఆయన పర్యటనకు ఒక పక్క వైకాపా నాయకులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తుండగా మరో పక్క యువత ఎన్నో ఆశలతో ఆయనతో ముఖాముఖిగా పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.

యువభేరితో టిడిపికి
గుణపాఠం

శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 1: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసి గెలిపించిన యువత నేడు అధికార టిడిపి మోసాన్ని గ్రహించి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉందని వైకాపా సీనియర్ నేత ఆర్.వి.ఎస్.కె.రంగారావు(బేబి నాయన) పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువకులు, ప్రజలు బాగుపడతారని, అయితే ప్రత్యేక ప్యాకేజీ వస్తే మాత్రం అధికార పార్టీ నేతలు, పెద్దలు బాగుపడతారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టాక హామీలను విస్మరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎపుడు గుణపాఠం చెబుదామా అని ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలో ఏ చిన్న అపశ్రుతి జరిగినా పాలకపక్షం నేతలు ప్రతిపక్షంపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాలకు తమ అధినేత జగన్మోహనరెడ్డి అడ్డుకట్ట వేస్తున్నందుకే ఇటువంటి అభూత కల్పనలు అంటగడుతున్నారన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ యువభేరి కార్యక్రమంలో జగన్‌తో యువకులు స్వయంగా మాట్లాడి, తాము ఉన్నత చదువులు చదివినా వలస బాట పట్టాల్సిన పరిస్థితులను తెలుసుకుంటారని పేర్కొన్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఉన్నారు.

నాగావళి సంగమ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 1: మండలంలోని బొంతలకోడూరు పంచాయతీ పాతదిబ్బలపాలెం సమీపంలో నాగావళి నదిబంగాళఖాతంలో కలిసే సంగమ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జెడ్‌పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీలు సోమవారం పరిశీలించారు. ఈ ప్రదేశంలో మహోదయం ఈ నెల 7,8 వతేదీల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై ఆయన స్థానికులనుండి ఆరాతీశారు. గతంలో ఇటువంటి పుణ్యస్నానాలకు ఎంతమంది భక్తులువిచ్చేశారని అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు ఎంపిపి బల్లాడ వెంకటరమణారెడ్డి, తహశీల్దార్ బి.వెంకటరావు, ఎంపిడివో పంచాది రాధ, ఆర్ ఐ వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పంచిరెడ్డి కృష్ణారావు, బాణ్న రాంబాబు, ఎం.చిన్నబాబు, జి.వెంకటరావు ఉన్నారు.

కులాన్ని అతిగా ప్రేమించడం అనర్థదాయకం
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 1: సమాజంలో కులాన్ని అతిగా ప్రేమించడం అనర్థదాయకమని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
తుని సంఘటన బాధాకరమని, శాసనసభలో సుదీర్ఘకాలం సభ్యునిగా ముద్రగడ పద్మనాభంను సున్నిత మనస్కుడిగా గమనించేవారమని, అయితే ఆయన అమాయకత్వంతో పాటు అతిగా కులాన్ని ప్రేమించిన వ్యక్తిగా కానవస్తున్నారని అన్నారు. ఈ బలహీనతలతో ఆయన కులానికి లాభం జరుగుతుందని కొన్ని శక్తులు తమ ప్రయోజనాలకు వాడుకోవడం బాధాకరమని, ఇప్పటికైనా ఆయన వ్యవహారశైలి మార్చుకోవాలని హితవుపలికారు. ప్రస్తుతం రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండగా, రాష్ట్ర ప్రయోజనాలు, యువత ప్రయోజనాల కోసం విజ్ఞులైన పద్మనాభం వంటివారు కృషిచేయాలన్నారు. ప్రభుత్వానికి కాపుల పట్ల సానుభూతి ఉండటంవలనే ప్రభుత్వం జస్టిస్ మంజునాథ ఆధ్వర్యంలో బిసి కమిషన్ వేసిన విషయాన్ని గుర్తుచేస్తూ తప్పనిసరిగా 9నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని ఆయన తెలియజేసారు.
రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ చేసే ప్రక్రియలో కమిషనర్ రిపోర్టు తప్పనిసరి అన్నది అందరూ గ్రహించాలన్నారు. ఆయనతో పాటు సమావేశంలో సింతు సుధాకర్, మాదారపు వెంకటేష్, జి.వి.రమణమూర్తి, కోరాడ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ఫైరింగ్ పేరేడ్ స్థల పరిశీలన
పొందూరు, ఫిబ్రవరి 1: జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న పోలీస్ ఫైరింగ్ పేరేడ్ స్థలాన్ని సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఎఎస్ ఖాన్ పరిశీలించారు.
మండల కేంద్రమైన పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలోగల పైడికొండ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఈ స్థలం పోలీస్ ఫైరింగ్‌కు అనుకూలంగా ఉందని ఇదే విషయాన్ని తాను పోలీస్ ఉన్నతాధికారులు నివేదిస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు. రాష్టస్థ్రాయి పోలీస్ అధికారులు కూడా ఈ స్థలాన్ని కొద్దిరోజుల్లో పరిశీలించనున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఎస్పీల కె.్భర్గవరావునాయుడు, దేవానంద్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.