శ్రీకాకుళం

చేపలు పెంచుకునే హక్కు మత్స్యకారులదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (రూరల్), నవంబర్ 21: మంచినీటి చెరువుల్లో చేపలు పెంచుకునే హక్కు మత్స్యకారులకే కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లాకలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం మండలంలోని పెదగనగళ్లపేట పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 193 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం ఉన్నప్పటికీ వేట సక్రమంగా సాగలేదన్నారు. మత్స్యకారులకు ఎక్కువ ఆదాయం వచ్చేందుకు జిల్లాలో 38,300 హెక్టార్లు తనిఖీ చేసి సర్వే నివేదికప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిపారు. మత్స్యకారగ్రామాల్లో మెరుగైన విద్యనందించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ నర్శయ్యపేట, గనగళ్లపేట గ్రామాల్లో తుపాను సెంటర్లనిర్మాణానికి నిధులుమంజూరు అయ్యాయని చెప్పారు. అలాగే 40లక్షల రూపాయలతో రోడ్డునిర్మాణానికి నిధులు మంజూరుఅయ్యాయని, టెండర్లు కూడా పిలవనున్నట్లు స్పష్టంచేశారు. గనగళ్లపేటనుండి కాజీపేటకు రోడ్డువేసేందుకు పరిశీలనలో ఉందన్నారు.
కుందువానిపేట గ్రామంలో మత్స్యకారులకు 200 ఇళ్లు నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. మత్స్యకార గ్రామాలాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఆప్కాబ్ డైరెక్టర్ మైలపెల్లి త్రినాథరావు, మత్స్యకార సంఘ సభ్యులు నర్శింగరావు, గనగళ్ల రాములు, సర్పంచ్ చీకటి గురువులు, ఎంపిటిసి గనె్నమ్మ, గన్నయ్య, సూరాడ మురళీమోహన్, ఎంపిపి గొండు జగన్నాథం, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మూకళ్ల శ్రీనువాసరావు, దుంగ అశిరన్న, సీర రమణ, చిట్టి మోహన్, మత్స్యకారులు, మహిళలు పాల్గొన్నారు.

సెక్యూరిటీ
గార్డుల
ఎంపికలు
ఎచ్చెర్ల, నవంబర్ 21: మండల కేంద్రంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో ఎంప్లాయ్‌మెంట్ అండ్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ పథకం ద్వారా సెక్యూరిటీ గార్డుల ఎంపికలు ఈనెల 23న నిర్వహిస్తున్నట్టు డిఆర్‌డిఎ పిడి ఎస్.తనూజా రాణి తెలిపారు. జి 4 సెక్యూటరిటీ సర్వీసెస్ కంపెనీల్లో గార్డు ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం రెండు గంటల లోపు హాజరుకావాలన్నారు.
పదోతరగతి ఉత్తీర్ణులై 18-35 సంవత్సరాల వయో పరిమితి ఉన్న పురుషులు మాత్రమే అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి కనీస వేతనం 8900 రూపాయలు చెల్లించబడుతుందన్నారు. హాజరయ్యే అభ్యర్థులు వారి రేషన్‌కార్డు, విద్యార్హతల సర్ట్ఫికేట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలతో హాజరుకావాలన్నారు.