శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దోమల దండయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 18: నెల్లూరు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా దోమకాటుకు ప్రజలు గురవుతున్నారు. ‘దోమలపై దండయాత్ర’ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తుంటే, అందులోని లోపాలను ఎత్తిచూపుతూ ఏకంగా దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర అంటూ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా దోమల్ని మాత్రం తరిమికొట్టలేక పోతున్నారు. మరీ ముఖ్యంగా పట్టణవాసాల్లో దోమల వల్ల ప్రజలు నిద్రకు సరిగా నోచుకోలేని దైన్యం. నెల్లూరు నగరంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అసలే దోమల పుట్టిల్లుగా ఉండే నగరంలోని అపరిశుభ్ర వాతావరణానికి గత నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారింది. సుమారు నెల రోజులుగా నగరంలో పేరుకుపోయిన చెత్తకుప్పలు, కాలువల్లో పూడిక చేరి మురికినీరు రోడ్లపైకి చేరుకుని దర్శనమిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఇరుకు వీధులు, వాణిజ్య సముదాయాలు కలిగిన మూలాపేట, సంతపేట, బాలాజీనగర్, నవాబుపేట, స్టోన్‌హౌస్‌పేట, మద్రాస్ బస్టాండ్, అరవింద్‌నగర్, ఫత్తేఖాన్‌పేట, పొగతోట తదితర ప్రాంతాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దోమలకు ఈ వాతావరణం చక్కగా ఒద్దికగా దొరకడంతో అక్కడ దోమల సంఖ్య రోజురోజుకీ రెట్టింపవుతోంది. దోమల కాటుకు గురై డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, విషజ్వరాలు తదితర వ్యాధులతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. మరణాలు కూడా సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలోని కార్పొరేటర్లు కూడా కాంట్రాక్టర్లుగా మారి డ్రైనేజీ కాలువలు కట్టించడంపై చూపుతున్న శ్రద్ధ డ్రైనేజీల్లో పూడిక తీయించడంపై చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘దోమలపై దండయాత్ర’ పేరుతో ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఖర్చుపెడుతున్న నిధుల మొత్తమైతే పెరుగుతోందే తప్ప దోమల దాడి మాత్రం తగ్గడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రత్యేక డ్రైవ్‌ల పేరుతో దోమల నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. నెల్లూరు, గూడూరు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, ఆత్మకూరు వంటి పురపాలికల్లో దోమల నివారణకు అక్కడి పాలకవర్గం, అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడం గమనార్హం. అధికారులు ఏదో అప్పుడప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన తరచూ చర్యలు తీసుకోకపోవడం వల్లనే దోమలను నివారించలేకపోతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా దోమల నియంత్రణకు తక్షణ ఉపశమన చర్యలు తీసుకొని ప్రజలను రోగాలబారిన పడకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక సంస్థల పాలకవర్గాలతో పాటు ప్రభుత్వంపై కూడా ఉందని నగరవాసులు గుర్తు చేస్తున్నారు.

నేటి నుంచిమల్లాం సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలు
చిట్టమూరు, సెప్టెంబర్18: మండలంలోని మల్లాం వల్లీదేవసేన సమేత స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అక్టోబర్ 1వ తేదీవరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండగా, 20వ తేదీ ఉదయం ధ్వజారోహణ, 24వ తేదీ రాత్రి నందిసేవ, 25న ఉదయం రథోత్సవం, 27 రాత్రి కల్యాణ రాయబారం, 28 ఉదయం కల్యాణ మహోత్సవం, తలంబ్రాలు, 29న ఉదయం వసంతోత్సవం, 30న రాత్రి అలకలదోపు, ఒకటవ తేదీ రాత్రి ఏకాంతసేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దాతలు, ఉభయకర్తలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వినియోగాలు చేపట్టనున్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని పాలకమండలి చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి, కార్యనిర్వాహణాధికారి సన్నారెడ్డి కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

కోర్కెలు తీర్చే ‘స్వయంభువుడు’ మల్లాం సుబ్రహ్మణ్యేశ్వరుడు
నిత్య దూపదీప నైవేధ్యాలతో విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే స్వయంభువుడిగా మల్లాం సుబ్రమణేశ్వరస్వామి ప్రసిద్ధికెక్కాడు. పాండ్యులు, చోళుల నాటినుండి ఆలయ అభివృద్ధికి 125 ఎకరాలకుపైగా మాన్యాన్ని కేటాయించారు. పాలకమండలి ఏర్పడిన తరువాత గడచిన రెండేళ్లలో ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. శరవణభవ పుణ్యక్షేత్రాల్లో, పురాతన, చారిత్రక ఆలయాల్లో ఒకటిగా, స్వయంభు క్షేత్రంగా మండలంలోని మల్లాంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆలయంలో ఆరు అడుగుల మూలవిరాట్ కొలువై ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో వెలుపల, లోపల ప్రస్తుత పాలక మండలి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు, ఉత్సవ మూర్తులకు వాహనాలు, వాహనాల గది ఏర్పాటు చేసి అభివృద్ధిపరచారు. నిత్యాన్నదానం, శుక్ర, మంగళ, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. సంతానం లేనివారికి స్వామివారం ధ్వజావరోహణం సందర్భంగా పొడిముద్దను స్వీకరిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. అభివృద్ది చెందుతున్న ఆలయానికి నిర్మాణంలో ఉన్న కోనేరు ప్రత్యేక ఆకర్షణ కానుంది.