శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బాబా పాదుకల దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 23: షిరిడీ సాయిబాబా నిజపాదుకల దర్శనం కోసం భక్తజనం కనుపర్తిపాడు ప్రాంతానికి పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడి దర్శించుకోవడం కనిపించింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన షిరిడీ సాయిబాబా నిజపాదుకల దర్శనం రెండోరోజైన ఆదివారం వీపీఆర్ కల్యాణ మండపం మరో షిరిడీని తలపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా భక్తులు పాదుకల దర్శనానికి క్యూలో గంటల తరబడి వేచి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద నుంచి కనుపర్తిపాడు సాయిబాబా పాదుకలు ఉంచిన కల్యాణ మండపం వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 40 వేల మంది భక్తులు పాదుకలు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. భక్తులకు అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. అనేక మంది భక్తులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. షిరిడీకి వెళ్లలేనివారు సాక్షాత్తు బాబావారు వేసుకొని తిరిగాడిన పాదుకలను దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యంగా వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి సమయంలో షిరిడీ సాయిబాబా ట్రస్టు నుంచి వచ్చిన సిబ్బంది సాయిబాబా కీర్తనలను భక్తులకు వినిపించారు. షిరిడీలో ఏ విధంగా అయితే హారతి సమయంలో నిర్వహిస్తారో అదే స్థాయిలో ఇక్కడ నిర్వహించడంతో భక్తులు ఆనందించారు. బాబాకు సంబంధించిన భజన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఐదు గ్రూపులుగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాదుకల వద్దనే ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన సూచనలు ఇవ్వడం కనిపించింది. ఆదివారం కావడంతో మరింత సందడి కనిపించింది. కల్యాణ మండపం నుంచి జాతీయ రహదారి వరకు విద్యుద్దీపాలంకరణ, సాయి నామస్మరణ మైకులు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా సాయిబాబా స్మరణతో మార్మోగింది. ఆదివారం కూడా అనేక మంది పురప్రముఖులు స్వామివారి పాదుకలను దర్శించుకొని వెళ్లడం కనిపించింది.

గుర్తుకొస్తున్నాయి..!
* బాల్యాన్ని నెమరేసుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్
* గురువులకు ఆత్మీయ సత్కారం
నెల్లూరు, సెప్టెంబర్ 23: చాలారోజుల తర్వాత నెల్లూరు నగరానికి విచ్చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ వైపు ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు మరోవైపు పార్టీ వ్యవహారాల గురించి సూచనలు చేస్తూ కూడా నగరంతో తనకున్న అనుబంధాన్ని, తన బాల్యాన్ని, తన ఉన్నతికి కారణమైన గురువులను కూడా గుర్తు చేసుకున్నారు. కేవలం గుర్తుచేసుకోవడమే కాకుండా గురువుల పాదాలకు నమస్కరించి వారిని ఆత్మీయంగా సత్కరించడం ద్వారా వారిపై తనకు ప్రేమాభిమాలను చాటుకున్నారు. తాను నెల్లూరులో 10వ తరగతి వరకు చదువుకున్న సెయింట్ జోసఫ్ పాఠశాలలోని తన సహ విద్యార్థులు, స్నేహితులను గుర్తుపెట్టుకొని మరీ పలకరించారు. పెద్ద సినీస్టార్ హోదాలో ఉన్న పవన్‌కల్యాణ్ తమను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని పేరుపేరునా పలకరిస్తుండటంతో ఉబ్బితబ్బిబ్బవడం వారి వంతైంది. ప్రస్తుతం ఏం చేస్తున్నదీ, కుటుంబ వివరాలను పవన్‌కల్యాణ్ వారిని అడిగి తెలుసుకున్నారు.
త్వరలో జిల్లాలో కమిటీల నియామకం
పార్టీ ముఖ్యులతో నిర్వహించిన అంతరంగిక సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లోగా నెల్లూరు జిల్లాలో పార్టీ క్షేత్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీల నియామకం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఫ్లెక్సీ పులుల్లా వ్యవహరించవద్దని, ఫ్లెక్సీల్లో కనిపించినంత మాత్రాన వారే నేతలని భావించవద్దని కొంతమంది నేతలకు పరోక్షంగా చురకలంటించారు. ఈ సమావేశంలో పార్టీ నేత మాదాసు గంగాధరం, చెన్నారెడ్డి మనుక్రాంత్, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.