శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ సమావేశానికి జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి ఎలా హాజరవుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 20: అసలు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి ఎందుకు హాజరయ్యారు.. అధికారికంగా కౌన్సిల్ తీర్మానాన్ని బలవంతంగా ప్రతిపక్ష సభ్యులచేత ఎలా చేయిస్తారు.. ఈ సిఫారసు వెనుక మంత్రినా లేక కమిషనర్ హస్తం కూడా ఏమైనా ఉందా అంటూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరేంద్రకుమార్‌ను ప్రశ్నించారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రతిపక్ష కౌన్సిలర్లు, వైకాపా నాయకులతో కలసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఈనెల 16న జరిగిన కౌన్సిల్ తీర్మానంలో అధికార పార్టీకి చెందిన జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి సమావేశానికి ఎలా హాజరయ్యారు.. ఆయనకు ఆ ఆధికారం ఉందని ఇష్టానుసారంగా సమావేశానికి విచ్చేసి మున్సిపాలిటీ ఆదాయానికి గండికొట్టే తీర్మానాన్ని కౌన్సిల్‌లో బలవంతంగా అందరిచేత ఆమోదిస్తుంటే ఒక అధికారిగా మీరు ఏ చర్యలు తీసుకొన్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి కమిషనర్ వెంటనే జోక్యం చేసుకొని చైర్‌పర్సన్ అనుమతితో ఎవరైనా సమావేశానికి రావచ్చునని అది కమిషనర్‌కు సంబంధం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గం తీరుతెన్నులు లేకుండా పోయిందని అంతా అధికారపార్టీ నేతల కనుసన్నలోనే అన్నీ జరుగుతున్నాయని దీనిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదన్నారు. సూళ్లూరుపేట పట్టణంలో అధునాతన వసతులతో కూడిన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని షార్ వారు వారి నిధులతో నిర్మించి మున్సిపాలిటీకి అప్పగించారు. అప్పుడున్న మార్కెట్‌ను కూల్చివేసేటప్పుడే కౌన్సిల్ తీర్మానంలో ఉన్నవారికే 33 శాతం పెంచి ఇచ్చే విధంగా కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. దీని ప్రకారం ఇవ్వకుండా దానిని తగ్గించి మళ్లీ వ్యాపారస్తులకు మేలు చేకూరేలా మళ్లీ ప్రత్యేక కౌన్సిల్ పెట్టి చర్చించి తగ్గించి ఈనెల 16న జరిగిన కౌన్సిల్ తీర్మానంలో సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించి ప్రస్తుతం ఉన్న లీజుదారులకే అప్పగించే విధంగా ఆమోదించారు. ఈ ఆమోదానికి ప్రతిపక్ష సభ్యులు కూడా అంగీకరించారు. ఏమైందో కాని కౌన్సిల్ సమావేశం మరుసటిరోజు ఫ్లోర్‌లీడర్‌తో కలసి ప్రతిపక్ష సభ్యులు డిసెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దుకాణ లీజుల్లో అధికార పార్టీకి చెందినవారు అధికంగా ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిని ప్రతిపక్ష సభ్యులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శలు గుప్పించడంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. మంత్రి ఆదేశాలతో జడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి ఏకపక్షంగా కూరగాయల మార్కెట్ సముదాయాన్ని పాత లీజుదారులకే దక్కే విధంగా కౌన్సిల్‌లో తమ సభ్యులచేత కూడా బెదిరించి తీర్మానం చేయించారని ఆరోపించారు. అసలు సమావేశానికి ఆయన ఎలా వస్తారంటూ ధ్వజమెత్తారు. లీజుదారుల్లో అధికార పార్టీ నాయకులు పలువురు దుకాణదారుల వద్ద భారీ మొత్తంలో వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా తగ్గించి షాపులు ఇచ్చారన్నారు. పేదల నోరుకొట్టి వ్యాపారస్తులకు మున్సిపాలిటీ ఆదాయాన్ని ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కమిషనర్‌ను దీనికి సంబంధించిన రికార్డులు, మినిట్స్ బుక్ తెప్పించాలని పట్టుపట్టారు. వాటిని పరిశీలించి తీర్మానాలపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్మానంపై సభ్యులు ఇచ్చిన డిసెంట్‌తో పాటు ఈ విషయాన్ని కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పునఃపరిశీలించాలని కోరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీలో అంతా ఏకపక్షంగా జరుగుతోందని టీడీపీ ప్రభుత్వ దుర్మార్ఘపు పాలన వల్లే ఇలా జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అధికార పార్టీ నాయకులు దండుకొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై కౌన్సిల్ తీర్మానంలో మీ సభ్యులు ఉన్నారు కదా ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు.. మీరు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు కదా సమావేశానికి హాజరై ఎందుకు ఈ విషయంపై నిలదీయలేకపోయారని ప్రశ్నించగా ఎమ్మెల్యే పొంతనలేని సమాధానం చెప్పారు. మున్సిపాలిటీలో పాలన విధానంపై అనేకసార్లు ప్రతిపక్ష సభ్ములు కౌన్సిల్ సమావేశంలో నిలదీసి డిసెంట్‌లు ఇచ్చి ఎమ్మెల్యేకు సైతం విషయాన్ని తెలిపిన వౌనంగా ఉండిపోయారు. నాలున్నర ఏళ్లు వౌనంగా ఉండిపోయిన ఎమ్మెల్యే ఇప్పుడు అయిపోయిన పెళ్లికి సన్నాయి వాయించినట్లు కార్యాలయానికి వచ్చి ఆ రికార్డులు, ఈ రికార్డులు అంటూ మాట్లాడం పైగా మొదటిసారిగా పాలకపక్షంపై విమర్శలు చేయడంతో పట్టణ ప్రజలే కాకుండా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లే నోరెళ్లబట్టుకొని నవ్వుకొన్నారు. ఎమ్మెల్యేతోపాటు ఫ్లోర్‌లీడర్ ముత్తుకూరు లక్ష్మమ్మ, కౌన్సిలర్లు దశయ్య, చిట్టిబాబు, వైకాపా నాయకులు శేఖర్‌రెడ్డి, గండవరం సురేష్‌రెడ్డి, గాలి మల్లికార్జునరెడ్డి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.