జాతీయ వార్తలు

విభిన్న ప్రతిభావంతులకు సార్వజనీక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా విభిన్న ప్రతిభావంతులకు సార్వజనీక గుర్తింపు (యూనివర్సల్ ఐడి) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని భిన్న ప్రతిభావంతులు వివిధ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల ద్వారా సులభంగా లబ్ధిపొందేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని, అంతేకాకుండా మరో 12 శారీరక వైకల్యాలను పొందుపర్చి కొత్త చట్టం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతా శాఖ సహాయ మంత్రి కృషన్‌పాల్ గుర్జార్ తెలిపారు. కార్నియల్ అంధత్వాన్ని నిరోధించడంపై న్యూఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఒక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రాలను మరో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, అందుకే దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా విభిన్న ప్రతిభావంతులకు సార్వజనీక గుర్తింపు కల్పించాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి ప్రస్తుతం అమల్లోవున్న చట్టం కేవలం ఏడు రకాల శారీరక వైకల్యాలను మాత్రమే గుర్తిస్తోందని, కనుక మరో 12 రకాల శారీరక వైకల్యాలను పొందుపర్చి కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. వికలాంగులకు అనువైనదిగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘సుగమ్య భారత్’ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.218 కోట్లు కేటాయించడంతో పాటు విభిన్న ప్రతిభావంతులకు వివిధ సేవలను, సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.