జాతీయ వార్తలు

రుతుపవనాలపై ఐఎండీ అంచనాలు కరెక్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: నైరుతీ రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుగానే చేస్తున్న ప్రకటనలు శాస్ర్తియంగానే ఉన్నాయా? అన్న అనుమానం చాలామందిలో కలుగుతోంది. వర్షాలు వస్తాయని ప్రకటిస్తే ఎండలు మండుతున్నాయని, ఎండలు ఉంటాయని ప్రకటిస్తే వానలు కురుస్తున్నాయంటూ సామాన్యులు చాలా వరకు పేర్కొంటున్నారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైనె్సస్ నేతృత్వంలో నడుస్తున్న ఐఎండీ నైరుతీ రుతుపవనాల రాకపై దాదాపు 10 రోజుల రోజుల ముందుగా అంచనా వేస్తోంది. గత ఐదు సంవత్సరాల్లో ఐఎండీ ప్రకటించిన అంచనాల్లో 2015 మినహాయిస్తే మిగతా సంవత్సరాల్లో సరిగ్గానే ఉన్నాయి. నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్నితాకే తేదీలను ఐఎండీ వేసిన అంచనాలు, వాస్తవంగా రుతుపవనాల ఆగమనం వివరాలు ఇలా ఉన్నాయి. 2014 జూన్ 5 న రుతుపవనాలు వస్తాయని ఐఎండీ ప్రకటించగా, జూన్ 6 న వచ్చాయి. 2015 లో మే 30 న వస్తాయని అంచనావేయగా, జూన్ 5 న వచ్చాయి. 2016లో జూన్ 7 న వస్తాయని ప్రకటించగా, జూన్ 8 న వచ్చాయి. 2017 లో మే 30 న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించగా, అదే రోజు తాకాయి. 2018 లో మే 29 న వస్తాయని అంచనా వేయగా, ఆదే రోజు వచ్చాయి. ఈ సంవత్సరం జూన్ 6 న నైరుతీరుతుపవనాలు వస్తాయని ఐఎండీ తాజాగా ప్రకటించింది. రుతుపవనాల రాకను అంచనావేసేందుకు ఐఎండీ ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. భారత్ వాయవ్య ప్రాంతంలో కనీస ఉష్ణోగ్రతలు, దక్షిణాన రుతుపవనాల ముందస్తు వర్షాలు, దక్షిణచైనా సముద్రంలో ఔట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ ప్రభావం, హిందూమహాసముద్రం ఈశాన్య భాగం, తూర్పుభాగాల్లో గాలుల వేగం, పసిఫిక్ ఆగ్నేయ భాగంలో ఔట్‌గోయింగ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.