జాతీయ వార్తలు

బౌద్ధమతంలో చేరిన రోహిత్ కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 14: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సుమారు మూడు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కుటుంబం గురువారం బౌద్ధమతాన్ని స్వీకరించింది. హిందూమతంలోని కుల వ్యవస్థ అణచివేత నుంచి విముక్తి కోసమే బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు రోహిత్ కుటుంబం ప్రకటించింది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సమక్షంలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు నాగ చైతన్య వేముల అలియాస్ రాజా వేముల బౌద్ధ భిక్షువుల నుంచి ‘దీక్ష’ తీసుకున్నారు. రోహిత్ (27) జనవరి 17న హెచ్‌సియు క్యాంపస్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హిందూమతంలోని కుల వ్యవస్థకు తాము వ్యతిరేకమని, అందువల్ల అణచివేసే కుల వ్యవస్థ లేని బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని రాజా చెప్పారు. కుల వ్యవస్థ నుంచి విముక్తి కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. సమస్యలపై గొంతు విప్పిన వారిని అణచివేయటానికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అదే సమయంలో అంబేద్కర్ జయంతిని ఉపయోగించుకొని ఆయనను పొగుడుతోందని రాజా విమర్శించారు. రోహిత్ బౌద్ధమతంలోకి మారనప్పటికీ బౌద్ధాన్ని ఎంతో ప్రేమించేవాడని, అతను ఈ రోజు జీవించి ఉంటే తాము తీసుకున్న చర్య చూసి గర్వించేవాడని రాజా అన్నారు. రోహిత్ బుద్ధిస్టు కావాలని కోరుకున్నాడని, కాని అలా కాకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని రాజా అన్నారు. ఈ రోజు నుంచి తన తల్లికి, తనకు రోజువారీ అవమానాల నుంచి విముక్తి లభించబోతోందని పేర్కొన్నారు.