జాతీయ వార్తలు

‘నీట్’పై వీడని గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశానికి ఏకీకృత పరీక్ష- నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో విద్యార్థులు అయోమయంలో పడగా, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలపై పూర్తిస్థాయి బెంచ్‌కు అప్పీలుకు వెళ్తామని ప్రకటించాయి. తమిళనాడు, కేరళ, అస్సాం సహా పలు రాష్ట్రాలు అప్పీలుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరో పక్క కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రానున్న రోజుల్లో ‘నీట్’కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు వస్తాయోనని, ఇంత వరకూ జరిగిన ఎపి ఎమ్సెట్, మరో వారం రోజుల్లో జరగబోయే తెలంగాణ ఎమ్సెట్ భవితవ్యంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు స్టేట్ సిలబస్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. ఇందులో ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్ష రాసేది ఆరు లక్షల మంది వరకూ ఉంటారు. నీట్ పరీక్షకు ఇరు రాష్ట్రాల్లో అర్హులైన అభ్యర్థులు రెండు లక్షల వరకూ ఉంటారు. వీరంతా స్టేట్ సిలబస్‌లో పరీక్షలకు సన్నద్ధమైన వారే. కేంద్రప్రభుత్వం ‘నీట్’ పరీక్షను నిర్వహించే పక్షంలో అది సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌లో జరుగుతుంది. మరో పక్క పట్టణాల్లో విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకూ మధ్య విద్యావికాసంలో ఎంతో తేడా ఉంది. పట్టణాల్లోని విద్యార్థులు అపరిమితమైన అవకాశాలతో ముందుండగా, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రం అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా నీట్‌కు హాజరుకావల్సి వస్తే సిబిఎస్‌ఇ సిలబస్ ప్రకారం పరీక్ష రాయాలి. ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇదో పెద్ద ఇరకాటం. ఇదే విషయాన్ని శుక్రవారం అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో ప్రస్తావించినా పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎలాంటి మార్పులకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయకున్నా, అభ్యంతరాలపై దరఖాస్తులు వస్తే అప్పుడు సరైన సమయంలో స్పందిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్ ఆర్ దవే ప్రకటించడం పెద్ద ఊరటగా భావిస్తున్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లో ‘నీట్’ను అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినా ఈ తీర్పు మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌లకు వర్తించదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్లాజు నీట్ పరీక్ష నిర్వహణకు మాత్రం వర్తించదని శుక్రవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్రం పేర్కొనడంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.