జాతీయ వార్తలు

ఇక ఇంటింటికీ గంగాజలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: పవిత్ర గంగాజలం కూడా ఈ కామర్స్ రూటు పడుతోంది. మార్కెట్‌కు వెళ్లకుండానే మొబైల్ ఫోన్లు, చీరలు, దుస్తులు, ఆభరణాలే ఈ కామర్స్ ద్వారా వినియోగదారుల ఇళ్లకు ఎలా చేరుతున్నాయో.. కాశీ మహాక్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పవిత్ర గంగాజలం కూడా ఇళ్లకు చేరుకునే తరుణం ఆసన్నమైంది. దేశం నలుచెరగులా విస్తరించిన పోస్ట్ఫాసు నెట్‌వర్క్‌నే ఇందుకు కేంద్రం వినియోగించుకోబోతోంది. గంగాజలాల్ని పోస్టుల ద్వారా అందించాలంటూ తనకు ఇప్పటివరకూ ఎన్నో అభ్యర్థనలు అందాయని.. ఇందుకు సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశానని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం నాడిక్కడ తెలిపారు. హరిద్వార్, రుషికేష్‌ల నుంచి స్వచ్ఛమైన గంగాజలాన్ని ప్రజల ఇళ్లకు పంపించే చర్యలు చేపట్టాలని పోస్టల్ విభాగం అధికారుల్ని కోరినట్టు తెలిపారు. ప్రజల ఈ సాంస్కృతిక అవసరాన్ని తీర్చేందుకు అన్ని చర్యలూ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. ఫోన్లు, చీరలు, ఆభరణాలను అందిస్తున్న పోస్టు మ్యాన్‌లు గంగాజలాన్ని ప్రజలకు అందించేందుకు ఎంతైనా అవకాశం ఉందన్నారు.