జాతీయ వార్తలు

భగ్గుమన్న ఆర్మీ డిపో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్‌గావ్/ న్యూఢిల్లీ, మే 31: మహారాష్టల్రోని పుల్‌గావ్‌లో ఉన్న ఆర్మీ ఆయుధాగారంలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన నారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 16 మంది మృతి చెందారు. దేశంలోనే అతి పెద్ద ఆయుధాగారమైన పుల్‌గావ్ ఆయుధాగారంలోని ఒక షెడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆయుధాగారంలోని అత్యంత సున్నితమైన పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఒక షెడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగాయి. రాత్రంతా శ్రమించిన తర్వాత మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు సైన్యం ప్రకటించింది. అయితే ఈ క్రమంలో ఇద్దరు సైనికాధికారులు, ఒక ఆర్మీ జవాను, 13 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు అధికారులు, 15 మంది జవాన్లు గాయపడ్డారని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్( డిజిఎంఓ) లెఫ్టెనెంట్ జనరల్ రణబీర్ సింగ్ న్యూఢిల్లీలో విలేఖరులకు చెప్పారు. ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లతో పాటుగా పెద్ద ఎత్తున చెలరేగిన మంటలతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భీతావహులైనారు. సైన్యం చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా, అగ్నిప్రమాదానికి కారణాలను నిర్ధారించుకోవడానికి సైన్యం ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సింగ్ చెప్పారు. నష్టం అంచనాకు చర్యలు సైతం మొదలైనాయని ఆయన చెప్పారు. మొదట 17 మంది చనిపోయారని ప్రకటించిన సైన్యం ఆ తర్వాత ఆ సంఖ్యను 16గా నిర్ధారించింది. ఇదిలా ఉండగా ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రదాని నరేంద్ర మోదీ పుణెలో ఉన్న రక్షణ మంత్రి మనోహర్ పారిర్‌ను తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా సంఘటన స్థలాన్ని సందర్శించినట్లు ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పుల్‌గావ్ సెంట్రల్ ఆర్మీ డిపో నాగపూర్‌కు 115 కిలోమీటర్లదూరంలో ఉంది. దాదాపు 1700 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆయుధాగారం సైన్యానికి అత్యంత ముఖ్యమైనది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారయ్యే ఆయుధాలు, మందుగుండు మొదట ఇక్కడికి చేరుకున్న తర్వాత వివిధ సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తారు. ఇక్కడ నిల్వ ఉంచే ఆయుధాలు, మందుగుండులో బాంబులు, గ్రెనేడ్లు, శతఘ్ని గోళాలు, ఎకె రైఫిళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు లాంటివి ఉన్నాయి. ప్రాథమిక వార్తల ప్రకారం మొదట మంటలు డిపోలోని సున్నితమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలుంచిన ఓ షెడ్‌లో మొదలైనాయి. వెంటనే రంగంలోకి దిగిన క్విక్ రియాక్షన్ బృందాలు, అగ్నిమాపక దళాలు మంటలను కేవలం ఒక్క షెడ్‌కే పరిమితం చేయడంలో విజయవంతమైనాయని లెఫ్టెనెంట్ జనరల్ సింగ్ చెప్పారు. గాయపడిన వారిని హెలికాప్టర్‌లో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్ధా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, స్పెషలిస్టు చికిత్స అందించడం కోసం పుణెలోని ఆర్మీ ఆస్పత్రినుంచి ప్రత్యేక వైద్య బృందాలను కూడా పంపిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ముఖ్యమైన ఆయుధాగారాన్ని కాపాడడంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చిత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్న రక్షణ మంత్రి పారికర్, ఆర్మీ చీఫ్ దల్బీర్