జాతీయ వార్తలు

దోషులు 24 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 2: పధ్నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లో నాటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా 69మందిని కిరాతకంగా ఊచకోత కోసిన గుల్బర్గ్ సొసైటీ కేసులో 24 మందికి శిక్ష పడింది. అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో గురువారం తీర్పు చెప్పింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పిబి దేశాయ్ ఈ కేసులో తీర్పు చెప్తూ బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ బిపిన్ పటేల్ సహా 36మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. మిగతా 24మందిలో 11మందిపై ఐపిసీ 302 సెక్షన్ కింద హత్యారోపణలు రుజువైనాయి. విహెచ్‌పీ నేత అతుల్ వైద్యతో సహా 13మందికి చిన్న నేరాల కింద దోషులుగా తీర్పు చెప్పారు. భారత శిక్షాస్మృతి లోని 120(బి) కింద నేరపూరిత కుట్ర చేసినట్లు ఎలాంటి అభియోగాలు రుజువు కాలేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దోషులకు జూన్ ఆరున శిక్ష విధించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి విచారణ జరుగుతున్న 9కేసుల్లో గుల్బర్గ్ కేసు ఒకటి. నాటి అల్లర్లలో సుమారు 400మంది గుల్బర్గ్ సొసైటీలోకి చొరబడి నాటి ఎంపి ఎహ్సాన్ జాఫ్రీ సహా 69 మందిని ఊచకోత కోశారు. 2002 ఫిబ్రవరి 27న గోధ్రా రైల్వే స్టేషన్‌లో సబర్మతి రైలులోని ఎస్-6 కోచ్‌ను దగ్ధం చేసి 58మంది కరసేవకులను సజీవదహనం చేసిన అనంతర ప్రతీకార దాడుల్లో గుల్బర్గ్ ఊచకోత ఒకటి.
జకియా జాఫ్రీ అసంతృప్తి
ఈ తీర్పుపై దివంగత ఎంపి ఎహ్సాన్ భార్య జకియా స్పందిస్తూ తీర్పు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. నిందితులందరికీ శిక్ష పడాలని, ఎందుకంటే, వాళ్లు ప్రజలను, ఆస్తులను విధ్వంసం చేశారని ఆమె అన్నారు. ‘నా కళ్లతో నేను స్వయంగా వాళ్ల ఊచకోతను చూశాను’ అని ఆమె అన్నారు. ఒక మహిళగా దోషులకు మరణ దండన విధించాలని కోరలేకపోయినా, కఠినమైన శిక్ష విధించాలని కోరుతున్నట్లు జకియా అన్నారు. ఆమె కుమారుడు తన్వీర్ స్పందిస్తూ ఈ కేసులో 36మంది నిర్దోషులుగా ఎలా బయటపడ్డారన్నది న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 400మంది మారణకాండకు పాల్పడితే కేవలం 24మందికే శిక్ష పడటం అన్యాయమన్నారు.
గుల్బర్గ్ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించిన ఆర్‌కే రాఘవన్ కూడా తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నిర్దోషులుగా విడుదలైన వారి పట్ల కొంతవరకు అసంతృప్తిగా ఉంది. మనం అన్ని సందర్భాల్లో గెలిచే అవకాశం లేదు. ఇది ఆటలో భాగం లాంటిది’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు. విచారణకు సంబంధించినంతవరకు తాను చేయగలిగినంత చేశానని, నిజాలను కోర్టు ముందు ఉంచామని, కోర్టు తమ వాదనతో కొంతవరకే ఏకీభవించిందని నేరపూరిత కుట్ర అభియోగాలను కూడా నమోదు చేశామన్నారు. కానీ కోర్టు దాన్ని అంగీకరించలేదని, దీనిపై వ్యాఖ్యానించటానికి ఏమీ లేదని రాఘవన్ అన్నారు.

చిత్రం అహ్మదాబాద్ గుల్బర్గ్ సొసైటీలో మారణకాండకు గురైన ఇళ్లు ఇవే.
* అల్లర్లలో మృతి చెందిన ఎహ్సాన్ జాఫ్రీ (ఫైల్ ఫొటో)