జాతీయ వార్తలు

ఒకటి ఇస్తాం.. తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక సహాయ మంత్రి పదవి అదనంగా ఇచ్చే అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బిజెపి నేత ఒకరు చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి, కేబినెట్‌లో సహాయ మంత్రి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అంతకంటే ముందు శివసేనకు ఒక మంత్రి పదవి అదనంగా ఇస్తామన్న బిజెపి ఆఫర్‌ను ఆ పార్టీ తిరస్కరించిందని, ఆ తర్వాతనే బిజెపి నేతలు బాబుకు ఫోన్ చేశారంటున్నారు. అయితే, బిజెపి నుంచి వచ్చిన ఫోన్‌పై చంద్రబాబు అంత పెద్ద ఆసక్తి ప్రదర్శించలేదని, తనకు కేంద్రంలో మరో మంత్రి పదవి తీసుకుంటే వచ్చే ప్రయోజనం లేదని, దానికంటే అదనపు నిధులు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని బాబు సదరు బిజెపి నేతకు చెప్పినట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఉదయానికి బాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే తెలంగాణ నుంచి గరికపాటి మోహన్‌రావు, ఏపి నుంచి తోట నరసింహం, నిమ్మల కిష్టప్పల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.