జాతీయ వార్తలు

వాల్తేర్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని టిడిపి ఎంపీ ఎం శ్రీనివాసరావులోక్‌సభలోప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చేసిన హామీ మేరకు ఒక కొత్త రైల్వే డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోఏర్పాటు చేయవలసి ఉందని ఆయన గుర్తుచేశారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతోపాటు ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్‌జోన్‌లోఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్‌తో కొత్త జోన్ ఏర్పడవలసి ఉందని ఆయన చెప్పారు. వాల్తేర్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందదని ఆయన అన్నారు. విశాఖ అభివృద్ధి చెందుతున్న తీరును దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వాల్తేర్ జోన్‌ను ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావుడిమాండ్ చేశారు.