జాతీయ వార్తలు
జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 ప్రయోగం 29న
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సూళ్లూరుపేట, ఆగస్టు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల చివరలో జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టే ఇన్‌శాట్-3డిఆర్ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి రోడ్డు మార్గాన భారీ భద్రత నడుమ శనివారం షార్‌కు చేరింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పంపే ఈ రాకెట్ రెండు దశల అనుసంధాన పనులను ఇప్పటికే శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. మూడో దశ అనుసంధాన పనులు సోమవారం నుండి ప్రారంభించనున్నారు. షార్‌కు చేరిన ఉపగ్రహాన్ని ప్రత్యేక క్లీన్ భవనంలో తుది పరీక్షలు నిర్వహించినానంతరం రాకెట్ చివరి భాగంలో అమర్చనున్నారు. 2061కిలోల బరువుగల కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఈ ఉపగ్రహాన్ని జిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఆగస్టు 29న సాయంత్రం 4:30గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ నెల 15న జరిగే ఎంఆర్‌ఆర్‌లో శాస్తవ్రేత్తలు తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన స్కాట్‌శాట్-1, ప్రాథమ్, పిశాట్ ఉపగ్రహాలతోపాటు విదేశాలకు చెందిన మరో 5 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి పనులు కూడా షార్‌లో వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు ప్రయోగాలకు ముందు ఈ నెల 12న లేదా 15న ఎటిఆర్ అనే చిన్న ప్రయోగం కూడా చేపట్టనున్నారు.
చిత్రం.. భద్రత నడుమ షార్‌కు చేరుకుంటున్న ఇన్‌శాట్-3డిఆర్ ఉపగ్రహం