జాతీయ వార్తలు

చీకటి పడితే చాలు.. అంతా గప్‌చుప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 26: ‘్భగో యహా సే’ (ఇక్కడినుంచి వెళ్లిపోండి).. 48 రో జులుగా కర్ఫ్యూ అమలులో ఉన్న శ్రీనగర్‌లోని ప్రతి గల్లీలో చీకటి పడగానే వినిపించే పారా మిలిటరీ జవాను కేక అది.
చీకటి పడితే చాలు మెయిన్ రోడ్డుపైకి సైతం రావడానికి వారు ఎవరినీ అనుమతించడం లేదు సరికదా కర్ఫ్యూ పాస్ ఉన్నా, లేదా ఏదయినా అత్యవసర పని మీద బైటికి వెళ్లాల్సి ఉందని చెప్పినా సరే వారు వినిపించుకోవడం లేదు. కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. గత నెల 8వ తేదీన అల్లర్లు ప్రారంభమైనప్పటినుంచి కాశ్మీర్ లోయలోని మిగతా పట్టణాల మాదిరిగానే శ్రీనగర్‌లో కూడా రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ‘ఇలాంటి కేకలు వినడం రోజూ మామూలయి పోయింది. కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న చౌక్ చేరుకోడానికి నేను ఇరుకు గల్లీలు, సందులు గొందుల గుండా రెండు కిలోమీటర్లకు పైగా దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది’ అని పాత నగరంలోని రైనావారి ప్రాంతానికి చెందిన ముస్తాక్ అలీ అనే అతను చెప్పాడు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తగారికోసం అతను కొన్ని మందులు తీసుకెళ్తున్నాడు. భార్యతోకలిసి వెళ్తున్న మిర్ గమ్యాన్ని చేరడానికి తన దారి మార్చుకుని వేరే మార్గంలో వెళ్లక తప్పలేదు. అయినప్పటికీ దారిలో కొంతమంది యువకులు అతడ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. లాఠీలు, పెట్రోలు, కిరోసిన్ నింపిన బాటిళ్లు కలిగి ఉన్న ఆ యువకులు ఎవరైనా సరే అన్ని వివరాలు చెప్తే కానీ వదిలి పెట్టరని అతను చెప్పాడు. ‘్భద్రతా దళాలయితే కనీసం వెనక్కి వెళ్లడానికయినా అవకాశమిస్తారు. వీళ్లయితే ఆ అవకాశం కూడా ఇవ్వరు. మనం చెప్పిన వివరాలన్నీ నిజమో కాదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వెళ్లనిస్తారు’ అని మిర్ భార్య చెప్పింది. కాశ్మీర్ లోయలో ప్రతి సామాన్యుడికీ ఇలాంటి అనుభవాలే ఎదురవుతూ ఉన్నాయి. భద్రతా దళాలకు, ఆందోళన చేస్తున్న యువకులకు మధ్య అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగి పోతున్న వారి ఈ బాధలు తీరే మార్గం కనుచూపు మేరలో కనిపించడం లేదు కూడా. శుక్రవారం నగరంలో పర్యటించిన పిటిఐ ప్రతినిధితో చాలామంది ఇలాంటి చేదు అనుభవాలనే పంచుకున్నారు. అయితే తామేమీ రాక్షసులం కాదని, తమకూ మానవత్వం ఉందని, ముందు జాగ్రత్త చర్యగా తాము కఠినంగా ఉండక తప్పడం లేదని భద్రతా దళాలు అంటున్నాయి. ఒక వేళ ఎవరికైనా వైద్యం అత్యవసరమయితే పేషెంట్ ఆస్పత్రి చేరేలా తాము అన్ని చర్యలు తీసుకుంటామని రైనావారి చౌక్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ భద్రతా అధికారి చెప్పారు.

శ్రీనగర్‌లో కర్ఫ్యూ విధించి శుక్రవారానికి 49వ రోజు..
దీనికి సమ్మెకూడా తోడుకావడంతో గస్తీ నిఘా ముమ్మరం చేసిన జవాన్లు