జాతీయ వార్తలు

జలవనరుల్ని సంరక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 26: భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇంకా రాష్ట్రంలో 2.4 శాతం వర్షపాతం లోటు ఉందని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జలవరులన్నింటినీ కాపాడుకోవాలని, చెరువులు, కుంటలకు సకాలంలో మరమ్మతులు చేయాలని సూచించారు. నీరు-ప్రగతిపై సర్పంచ్‌లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ చెరువును మీరు కాపాడుకోలేకపోతే నీటి సంఘం అధ్యక్షుడిగా ఏ ఒక్కరూ తగరని నీటిపారుదల సంఘాల అధ్యక్షులతో చంద్రబాబు అన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంలో రాష్ట్రం రెండో స్థానంలో వుందంటూ మొదటి స్థానం పొందేలా యుద్ధప్రాతిపదికన పనులను వేగిరపర్చాలన్నారు. ‘ఎన్టీఆర్ జలసిరి’ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవాలన్నారు. రాష్ట్రంలో రూ.1000 కోట్లతో కోస్టల్ బయోడైవర్సిటీ అభివృద్ధి చేయాలన్నారు. రాబోయే 15ఏళ్లకు మొక్కల పెంపకంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. తిరుపతి కొండలు, విశాఖ కొండల్లో రంగురంగుల పూలచెట్ల పెంపకం (్ఫ్లవరింగ్ ప్లాంటేషన్)పై దృష్టి పెట్టాలన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలునాటే ప్రాంతాలను, నర్సరీల ఏర్పాటు ప్రదేశాలను ఇప్పటి నుంచే గుర్తించాలన్నారు. డ్వాక్రా మహిళలకు ట్యాబ్‌ల వినియోగంలో శిక్షణ ఇచ్చి జియో ట్యాగింగ్ పనిలో వినియోగించాలన్నారు.