జాతీయ వార్తలు

తీవ్రమైన కరెన్సీ కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఆర్థిక గందరగోళం ఆరు రోజులయినా కుదుటపడలేదు. రూ.500, 1000 నోట్ల ఉపసంహరణతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర కరెన్సీ కొరతతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలంతా అల్లాడిపోతున్నారు. రోజువారీ అవసరాలకోసం చేతిలో చిల్లిగవ్వ లేక చితికిపోతున్నారు. బ్యాంకు శాఖలు, ఎటిఎం కేంద్రాల వద్ద నగదుకోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. సోమవారం బ్యాంకులకు సెలవు ప్రకటించడంతో దేశంలో అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేసి ఉన్న కారణంగా ప్రజలు నగదుకోసం తెల్లవారు జామునుంచే ఎటిఎం కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. అయితే ఎటిఎంలలో తగినంత నగదు లేకపోవడంతో అనేకమంది నిరాశకు గురయ్యారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఎటిఎం కేంద్రాల వద్ద నగదుకోసం తోపులాటలు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడక్కడా తెరచి ఉన్న బ్యాంకుల శాఖల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సమాజంలోని అనేక రంగాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా నగదుపైన ఎక్కువగా ఆధారపడిన చిన్న వ్యాపారులు, రెస్టారెంట్ల యజమానులు, ట్రాన్స్‌పోర్టర్లు వంటివారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలవల్ల నెలకొన్న పరిస్థితిని అదుపు చేయలేక బ్యాంకులు కూడా పనిచేయలేక పోతున్నాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నగదు కొరతను తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. దేశంలోని నలుమూలలా ఉన్న సామాన్య ప్రజలకు నగదును అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టిందని ఆయన విలేఖరుల సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఎటిఎం నెట్‌వర్క్‌ను పనిచేయించడంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు కరెన్సీకి సరఫరా చేయడమనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, తపాలా కార్యాలయాల ద్వారా గ్రామీణ ప్రజలకు కరెన్సీని అందుబాటులోకి తెస్తామన్నారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు తమ వద్ద ఉంచుకునే నగదు పరిమితిని రూ.50వేలకు పెంచనున్నట్లు చెప్పారు. కరస్పాండెంట్లు వారంలో ఎన్నిసార్లయినా తిరిగి చెల్లించేట్లు వెసులుబాటు కల్పించనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1.2 లక్షల బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 1.35 లక్షల తపాలా కార్యాలయాలను ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నగదును చేరువ చేస్తామని చెప్పారు. అలాగే, మారిన నోట్లకు అనుగుణంగా ఎటిఎంలను తిరిగి సరిచేయడం (రీకాలిబ్రేషన్)తోపాటు ఎటిఎం నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని శక్తికాంత దాస్ తెలిపారు.
ఎటిఎంల రీకాలిబ్రేషన్ తరువాత కొత్త 2000 రూపాయల నోట్లు కూడా మంగళవారం లేదా బుధవారం నుంచి ఎటిఎంలలో అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రీకాలిబ్రేషన్ చేసిన ఎటిఎంల నుంచి సామాన్య ప్రజలు రోజుకు రూ.2,500 వరకు నగదు తీసుకోవచ్చని ఆయన వివరించారు. కనీసం మూడు నెలలకన్నా ముందు తెరిచిన కరెంట్ ఖాతానుంచి నగదు ఉపసంహరణ (విత్‌డ్రావల్) పరిమితిని వారానికి రూ. 50వేలకు పెంచనున్నట్టు ఆయన తెలిపారు.