హైదరాబాద్

చంకలో పందిపిల్లతో ఏటీఎం వద్ద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: చిత్ర పరిశ్రమలో ప్రతీ దర్శకుడికి ఓ స్టైల్ ఉంటుంది. అలా విభిన్నంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లో రవిబాబుకు ఒక ప్రత్యేకత వుంది. ‘అల్లరి’ నుంచి ఆయన అనుసరిస్తున్నది కూడా అదే. సినిమాలు తీయడమే కాదు..వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా రవిబాబు విభిన్నంగా ఆలోచిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అదిగో’. ఈ సినిమాలో ప్రధాన పాత్రను ఓ పందిపిల్ల పోషిస్తోంది. ఇందుకోసం రవిబాబు ఆయన పందిపిల్లలను పెంచుతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘అదిగో’ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకుసన్నాహలు చేస్తున్నారు రవిబాబు. కేంద్ర ప్రభుత్వం రూ.500, 1000 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు డబ్బులు డ్రా చేయడం కోసం గంటల తరబడి ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదిగో ఇలా పందిపిల్లను చంకన వేసుకుని ఏకాంగా ఏటీఎం వద్ద ప్రత్యక్షమయ్యారు. నగదు విత్‌డ్రా చేసుకోవడంతో పాటు పనిలో పనిగా చీత్ర ప్రచారం కూడా పూర్తవుతుంది. నగరంలో ఏటీఎంల వద్ద డబ్బుల కోసం గంటల తరబడి నిల్చుంటున్న ప్రజలకు మద్దతుగా లేక కేంద్ర ప్రభుత్వం తీసకున్న నిర్ణాయానికి వ్యతిరేకంగా పందిపిల్లలతో క్యూలైన్‌లో నిల్చున్నాడా అని కొంతమంది ముక్కున వేలువెసుకున్నారు. దర్శకుడు రవిబాబు బంజారాహిల్స్‌లోని ఆంధ్రాబ్యాంకు ఏటీఏం వద్ద డబ్ములు డ్రాచేయడానికి వచ్చారు.

మేడ్చల్, నవంబర్ 23: మేడ్చల్ ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వైద్యుల తీరుపై ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులపై, పనీతీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పని తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వాసుపత్రిలో కేవలం అవుట్ పెషేంట్‌లను మాత్రమే చూస్తూ ఇన్ పెషేంట్‌లను చేర్చుకోకుండా కేవలం మాత్రలు ఇచ్చి పంపించి వేయడం సబబు కాదని వైద్యులకు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అవుట్ పెషేంట్‌లను చూసి వెళ్లిపోవడం కాదని 24 గంటలు ఆసుపత్రి వైద్యులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించే క్రమంలో వైద్యులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, అలా చేయకుండా ఎంత తొందరైతే అంత తొందరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహలను బంధువులకు అప్పగించే విధంగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోగులను చూసే విధానంలో ఇబ్బందులపై వస్తున్న ఫిర్యాదులపై ఎమ్మేల్యే వైద్యులను వివరణ అడిగి తెలుసుకున్నారు. వైద్యులు తమ పని తీరు మార్చుకోకపోతే మళ్లీ సమావేశం తర్వాత రాష్ట్ర హెల్త్‌కమిషనర్‌కు ఫిర్యాదు చేసి చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రిని పరిశీలించి పలు సూచనలు చేశారు.
వందశాతం పన్నులు
వసూలు చేయాలి
మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో హరితహారం, పన్నుల వసూలుపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు మనుగడ సాధించాలంటే పన్నులే ఆధారమనే విషయాన్ని మరువకూడదని సూచించారు. ఇజిస్ ద్వారా హరితహారంలో నాటిన మొక్కలను నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వాహణ, పరిశుభ్రతపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, డిపిఓ సురేశ్‌మోహన్, జిల్లా వైద్యాధికారి భానుప్రకాశ్, ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి శైలజ హరినాథ్, ఎంపిడిఓ దేవసహయం, ఇఓపిఆర్డీ రమేశ్, ఆయా శాఖల అధికారులు, కార్యదర్శులు, వైద్యులు ఐకెపి కార్యకర్తలు కవిత, వసంత, మంగ, దీప పాల్గొన్నారు.