జాతీయ వార్తలు

మరో రెండ్రోజులు మండే ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నప్పటికీ రానున్న రెండు రోజుల్లో ఇది మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ పరిశీలకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం. నిజామాబాద్ 42, రామగుండం 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇవి సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం. ఇక ఎపిలోని కర్నూలు 42, అనంతపురం, తిరుపతి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సాధారణం కంటే 2 డిగ్రీలు అధికం. కోస్తాలో గన్నవరం 39, నెల్లూరు 37, బాపట్ల, ఒంగోలు, కాకినాడ, తుని, విశాఖపట్నంలో 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 1 డిగ్రీ అధికం. వాయువ్య దిశగా వస్తున్న వేడిగాలుల ప్రభావమే తెలంగాణ, రాయలసీమల్లో అధిక ఉష్ణోగ్రతలకు కారణమని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు.
తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
కాగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్‌కు 340 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఆదివారం ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బర్మా సమీపంలో సోమవారం ఉదయానికి తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. అయితే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని పేర్కొన్నారు.