తెలంగాణ

ప్రశాంతంగా ప్రణయ్ అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 16: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం నాడు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం నాడు వేలాది మంది అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్‌పై భార్య అమృతవర్షిణి, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, తమ్ముడు అజయ్‌కుమార్‌లు కూర్చుని విలపించడం చూపరులను కలచి వేసింది. రోడ్ల వెంట బారులు తీరి ప్రజలు వీక్షించారు. అంతిమయాత్ర భారీ పోలీసు బందోబస్తు మధ్య పట్టణంలోని వినోభానగర్ ప్రణయ్ నివాసం నుంచి ప్రారంభమై శివాలయం, కలాల్‌వాడ, రాజీవ్‌చౌక్, అంబేద్కర్ రోడ్డు, తెలంగాణా చౌరస్తా గుండా ఆర్‌సీఎం చర్చికి చేరుకుంది. మృతదేహానికి చర్చి ఫాదర్ బాలస్వామి ప్రార్ధనలు నిర్వహించారు. చర్చి ముందు ప్రధాన నిందితుడు తిరునగరు మారుతిరావు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మారుతిరావును పట్టణ బహిష్కరణ చేయాలని, ఉరిశిక్ష విధించాలని, ఆస్తులను జప్తు చేయాలని యువకులు ఈసందర్భంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు డీఎస్పీలు పి.శ్రీనివాస్, సుధాకర్‌ల పర్యవేక్షణలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాకు చెందిన అన్ని సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది సుమారు 200 మంది సాయుధ పోలీసులు 100 మంది వరకు బందోబస్తు నిర్వహించారు.
అంతిమ యాత్రలో ప్రముఖ కవి, జానపద గాయకుడు గోరేటి వెంకన్న, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ఉపాధ్యక్షులు ముండ్లగిరి కాంతయ్య, తాళ్లపల్లి రవి, కొమ్ము శ్రీనివాస్, పోకల కిరణ్‌కుమార్, కె.విజయ్‌కుమార్, మట్టయ్య, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, జి.రామ్మూర్తియాదవ్, మాజీ మండలి చీఫ్‌విప్ డి.్భరతిబాయిరాగ్యా నాయక్, టిఆర్‌ఎస్ నాయకులు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ డి.చిట్టిబాబునాయక్, టిఆర్‌ఎస్ పట్టణ, మండల అద్యక్షులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దిశ్రీనివాస్‌గౌడ్, తలకొప్పుల సైదులు, ఒగ్గు జానయ్య, టిపిసిసి కార్యదర్శి డి.స్కైలాబ్‌నాయక్, పట్టణ కాంగ్రేస్ అధ్యక్షుడు కె.శంకర్‌నాయక్, కె.శౌరి, భారతీయ సామాజిక న్యాయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదాటి శ్యాంసుందర్, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రిసీ) కేంద్ర కమిటీ సభ్యులు అనంతరెడ్డి, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు అనురాధ, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు పరశురాములు, కేవీపీఎస్ నాయకులు రెమిడాల పరశురాములు, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్, మానవహక్కుల సంఘం సిఈఓ సాలి కెజియా, సిపిఐ మండల కార్యదర్శి సమీఖాద్రి, డి.లింగానాయక్‌లు పాల్గొన్నారు.