ఉత్తరాయణం

నెరవేరని రిజర్వేషన్ల లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగం దేశంలోని పాలకుల, పాలితుల సామాజిక సంవిధానం. ప్రవర్తన, పరివర్తన జీవనశైలికి క్రమవిధానం. రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడిన రిజర్వేషన్లు పీడితవర్గాల అభ్యున్నతికి, చైతన్యానికి సావకాశం. కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు వాటిపట్ల సానుకూలతలు, వ్యతిరేకతలు అనేది మూడు వేల ఏళ్లుగా సాగుతున్న చరిత్ర.
దేశానికి బ్రిటీష్ పాలన వచ్చాక 1870నుంచి ప్రతి 10 సంవత్సరాల కొకసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నది. 1910వరకు మతపరంగా, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అని విభాగాలు జరిగేవి. చర్చల అనంతరం 1910నుండి ఉప విభాగాలు వచ్చాయి. ముస్లిములను, క్రైస్తవులను విభజించకుండా, హిందువులను మూడు ఉప విభాగాలు చేశారు. గాంధీ 1920 ప్రాంతంనుండి హరిజనోద్ధరణ కొరకు అస్పృశ్యతా నిర్మూలన కోసం కు అగ్ర కులాలలో చైతన్యం తెచ్చే ఉద్యమం చేశాడు. 1932 కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించారు. ‘‘కులరీత్యా హిందువులను విభజించడం మొత్తం భారత సమాజాన్ని చీల్చివేయగలదు; అందువలన హిందువులలో మార్పును తీసుకొని రావటం ద్వారా మాత్రమే ప్రజలను ఐక్యంగా వుంచగలం’’ అని గాంధీ విశ్వసించారు. దళితులు పునరుజ్జీవం పొందేందుకు స్వయంకృషి, ప్రభుత్వ సహాయం, అగ్ర కులాల సహకారం అవసరమన్నాడు. డా.అంబేద్కర్ గాంధీని వ్యతిరేకించారు. ఈ విభేదించిన నేపథ్యంలో పూనాలో చర్చలుజరిగి ఒక ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం పీడిత వర్గాలను హిందువుల నుండి ప్రత్యేకించకుండా హిందువులలో భాగంగానే పరిగణించి వారిలోనే నియోజకవర్గాల కేటాయింపునకు అంగీకారం కుదిరింది. 1942లో అంబేద్కర్ ఎస్.సి.(పీడిత వర్గాలు)ల అభ్యున్నతికి పాటుపడుతూ అఖిల భారత షెడ్యూ లు కులాల ఫెడరేషన్ స్థాపించారు.
ఈ సందర్భంలో రాజ్యాంగ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతుండగా రాజ్యాంగ సభ సభ్యులు కమిటీలుగా ఏర్పడుతూ డ్రాఫ్టింగ్ కమిటీకి డా.అంబేద్కర్‌ను అధ్యక్షుడిని చేశారు. రాజ్యాంగం నిర్మించే సమయంలో నాయకులలో రాజ్యాంగ శాసనసభలో సుదీర్ఘ చర్చలనంతరం నిరంతర ప్రత్యేకతలు మంచిదికాదని శాసనసభలు, విద్యాఉద్యోగాలలో 10 సంవత్సరాల కాలం ఎస్.సి, ఎస్.టి షెడ్యూలు తెగలకు ప్రత్యేకతను (రిజర్వేషన్‌ను) నిర్ణయించి 334, 335, 336 అధికరణాలు వ్రాసి అంగీకరింపజేసి అమలుకు తెచ్చారు. తదుపరి ఉద్యోగ ప్రమోషన్లలోనూ ప్రత్యేకతను తెచ్చారు. 1950లో వచ్చిన రాజ్యాంగానికి ప్రతి పది సంవత్సరాలకు సవరణలు తెచ్చి ప్రస్తుతం 2020 సంవత్సరం వరకు రిజర్వేషన్ ఉండేట్లు రాజ్యాంగ సవరణ ఆరు దఫాలు జరిగింది.
రాజ్యాంగాన్ని పది సంవత్సరాలు అనుసరించి పరిపాలించాక మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పరిపాలనా పరిస్థితిని మూల్యాంకనం చేసి దీనులకు, పీడితులకు ఆర్థిక సహకారం, సామాజిక సమానత, గౌరవం కలిగించి అభ్యున్నతిని చేకూర్చవలసిందే కాని ప్రత్యేకతల వలన పరిపాలనకు వచ్చే ప్రతిభలేని వారితో రాజ్యం పరిపాలించటం సాధ్యంకాదని, దీన్ని గురించి చర్చించుకుందామని దేశంలోని ముఖ్యమంత్రులందరికీ 27-6-1961 లేఖలు వ్రాశారు. అయితే ప్రతిభకు, రిజర్వేషనుకు సంబంధంలేదని రిజర్వేషన్ ఒక ప్రజాస్వామిక హక్కు అని కొందరు వాదిస్తూ వచ్చారు. కారణాంతరాలవలన ముఖ్యమంత్రుల సమావేశం జరగలేదు. నెహ్రూ నిర్ణయంలో రాజకీయం లేదు. పరిపాలన, దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం మాత్రమే ముఖ్యాంశాలు. 1970 దశకంలో ‘దళిత’ పదం ప్రాపకానికొచ్చింది. అప్పటి హరిజనులు, పీడిత వర్గాలు, ఎస్.సిలనబడే వారందరు దళితులైనారు. దళిత పదం పేదరికం అర్ధం నుండి కులాల కూర్పు పదమైంది. దీన జనోద్ధరణకు బదులు దళిత జనోద్ధరణైంది. పదమేదైనా ఉద్ధరణే కర్యవ్తం అనుకుందాం. ప్రభుత్వానికి, ప్రజలకు ఈ 65 సంవత్సరాల పరిపాలనలో ప్రత్యేకతలపై అవగాహన అనుభవం వచ్చి వుంటుంది. అనుభవంలో రిజర్వేషన్, ముఖ్యోద్దేశాలైన ఆత్మగౌరవం, ఆర్థిక సమానత, సామాజిక సమానత ప్రజలు, ప్రభుత్వాలు ఎంతవరకు సాధించాయో సింహావలోకనం, మూల్యాంకనం చేసుకోవటం అవసరం.

- బి.హనుమారెడ్డి